SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » reviews » Sr Kalyanamandapam Movie Review In Telugu

SR కళ్యాణ మండపం మూవీ ఫస్ట్ రివ్యూ

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Fri - 6 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
SR కళ్యాణ మండపం మూవీ ఫస్ట్ రివ్యూ

SR కళ్యాణ మండపం.. గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈ చిన్న సినిమా ప్రమోషనల్ వీడియోస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో.., SR కళ్యాణ మండపం మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శ్రీధర్ గాదే దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీలో కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవల్కర్ హీరో, హీరోయిన్ గా నటించగా, డైలాగ్ కింగ్ సాయి కుమార్ కీలక పాత్ర పోషించారు. మరి.. రొమాంటిక్, యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన ‘SR కళ్యాణ మండపం’ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ:

కళ్యాణ్.. అందరిలానే ఓ సాధారణ మధ్యతరగతి కుర్రాడు. అప్పటి వరకు అతని జీవితంలో విలన్ ఎవరైనా ఉన్నాడంటే అతని తండ్రే. ఒకే ఇంట్లో ఉన్నా.., కళ్యాణ్ తన తండ్రితో మాట్లాడడు. కళ్యాణ్ తండ్రి తాగుడికి బానిసై, కుటుంబ పోషణని పట్టించుకోవడం లేదని అతని బాధ. కానీ.., గుండెల్లో నాన్న అంటే విపరీతమైన ప్రేమ. ఈ ఎమోషనల్ జర్నీ కొనసాగుతుండగా, కళ్యాణ్ కి కాలేజీలో సింధు అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి ప్రేమని దక్కించుకోవడానికి కళ్యాణ్ అన్నీ విధాలా ప్రయత్నాలు చేస్తుంటాడు.

Join Our Whatsapp Channel

సరిగ్గా.., ఇలాంటి సమయంలో కళ్యాణ్ జీవితంలో సెటిల్ అవ్వాల్సిన పరిస్థితిలు వస్తాయి. ఇందుకోసం SR కళ్యాణ మండపం’లో పెళ్లిళ్లు చేసి.., డబ్బులు సంపాదించాలి అనుకుంటారు కళ్యాణ్, అతని మిత్ర బృందం. కానీ.., ఇక్కడ ఓ లోకల్ పొలిటీషియన్ ఎంటర్ అవ్వడంతో కళ్యాణ్ లైఫ్ తలకిందులు అయిపోతుంది. ఊరిలో అందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి.. తనకి ఎదురైన కష్టాన్ని కళ్యాణ్ ఎలా అధిగమించాడు? తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడు? అన్నిటికీ మించి తన తండ్రికి ఎలా దగ్గరయ్యాడు అన్నది ఈ చిత్ర కథ.

విశ్లేషణ:

తెలుగు సినిమా అంటేనే ఎమోషన్స్ మెండుగా ఉండాలి. SR కళ్యాణ మండపంలో ఇలాంటి ఎమోషన్స్ కి కొదవే ఉండదు. అయితే..,ఇవి మరీ ఎక్కువ అయిపోయాయి. హీరో తన తండ్రిని మార్చుకోవాలి, హీరోయిన్ ప్రేమని దక్కించుకోవాలి, విలన్ అడ్డు తొలగించుకుని తన లక్ష్యాన్ని రీచ్ అవ్వాలి. ఒక్క టికెట్ మీద మూడు సినిమాలు అనమాట. నిజానికి ఇలాంటి లేయర్స్ ఉన్న కథని జాగ్రత్తగా హ్యాండిల్ చేయకుంటే .. అన్నీ చెడిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ.., SR కళ్యాణ మండపంలో అన్నీ సీక్వెన్స్ లు బాగా వచ్చాయి. కానీ.., ఇదే ఆ చిత్రానికి కాస్త మైనస్ అయ్యింది.

ముఖ్యంగా కథలో మిగతా ఎమోషన్స్ బలంగా కుదరడంతో హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ పూర్తిగా తేలిపోయింది. కథలో ఉన్న కొన్ని లోపాల కారణంగా కొన్ని చోట్ల ల్యాగ్ అనిపిస్తుంది. అయితే.., ఇవి కొంత మేర మేరకే. క్లయిమ్యాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ వీటంన్నింటిని మర్చిపోయేలా చేస్తుంది. రచయతగా అంత ప్రావీణ్యం లేని కిరణ్ అబ్బవరం కథలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉన్నా, శ్రీధర్ గాదే కథపై ఇంకాస్త ఫోకస్ పెట్టున్నా SR కళ్యాణ మండపం వేరే రేంజ్ లో ఉండేది.

నటీనటుల పని తీరు:

ముఖ్యంగా హీరో తండ్రిగా సాయికుమార్ చేసిన క్యారెక్టర్ ఈ సినిమాకి ప్రాణం పోసింది. సాయికుమార్ నటనలో విజృంభించడంతో ఆయన పాత్ర మిగతా కథని, క్యారెక్టర్స్ ని మింగేసింది. సినిమా జరుగుతున్నంత సేపు స్క్రీన్ పై సాయికుమార్ ఎప్పడు కనిపిస్తాడా అని ప్రేక్షకులు వెయిట్ చేసే పరిస్థితి వచ్చిందంటే సాయికుమార్ నటన ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తం మీద ఒక్క కిరణ్ అబ్బవరం మాత్రమే సాయికుమార్ ఫోర్స్ ముందు తేలిపోకుండా నటించగలిగాడు. ఈ రెండు పాత్రలు SR కళ్యాణ మండపం సినిమాని నిలబెట్టాయి. హీరోయిన్ కాస్త బొద్దుగా కనిపించింది. మిగతా నటీనటులు అంతా తమ పాత్ర పరిధి మేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

నిజానికి SR కళ్యాణ మండపం చిన్న సినిమానే అయినా.., నిర్మాణం విషయంలో నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. హీరో కిరణ్ అబ్బవరం కోసం నిర్మాత ఎంతైనా ఖర్చు పెట్టేలా అనిపించింది. ఇక చేతన్ భరధ్వాజ్ సంగీతం, పాటలు సినిమాకి మెయిన్ ఎసెట్స్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగా కుదిరింది. కానీ.., దర్శకుడిగా శ్రీధర్ గాదే ఇంకాస్త షార్ప్ గా అలోచించి, స్క్రీన్ ప్లే ఫాస్ట్ చేసి ఉండాల్సింది. ఓవరాల్ గా కథ, స్క్రీన్ ప్లే దగ్గర తప్పించి, SR కళ్యాణ మండపం మిగతా అన్నీ విషయాల్లో విజయం సాధించింది.

ప్లస్:

  • సాయికుమార్ క్యారెక్టర్
  • కిరణ్ అబ్బవరం ఎనర్జీ
  • సెంటిమెంట్ సీన్స్

మైనస్ :

  • హీరో హీరోయిన్ లవ్ ట్రాక్
  • స్లో నేరేషన్

చివరి మాట: SR కళ్యాణ మండపం సూపర్ సక్సెస్ కి కాస్త దూరంలో ఆగిపోయి జస్ట్ సక్సెస్ మాత్రం అయ్యింది.

రేటింగ్: 2.5/5

Tags :

  • Kiran Abbavaram
  • Priyanka Jawalkar
  • Sai Kumar
  • SR Kalyanamandapam
  • Sridhar Gade
Read Today's Latest reviewsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ‘రియాలిటీ’ పక్కా మాస్ ఎంటర్‌టైన్‌మెంట్!”

    ‘రియాలిటీ’ పక్కా మాస్ ఎంటర్‌టైన్‌మెంట్.. స్టార్ కాస్టింగ్‌తో దుమ్మురేపనున్న సినిమా!

  • బలగం వేణు దారిలో దర్శకుడిగా మరో జబర్దస్త్ నటుడు

    బలగం వేణు దారిలో దర్శకుడిగా మరో జబర్దస్త్ నటుడు

  • Kiran Abbavaram: అబ్బవరం అన్న.. నిన్ను నువ్వే తొక్కేసుకుంటున్నావ్! అర్ధమవుతోందా?

    అబ్బవరం అన్న.. నిన్ను నువ్వే తొక్కేసుకుంటున్నావ్! అర్ధమవుతోందా?

  • చీకట్లో జిగేల్ అనిపిస్తున్న ఈ బ్యాక్ బ్యూటీని గుర్తుపట్టారా?

    చీకట్లో జిగేల్ అనిపిస్తున్న ఈ బ్యాక్ బ్యూటీని గుర్తుపట్టారా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • వాట్సాప్‌లో ‘NO’ అని రిప్లై ఇస్తున్నారా? సైబర్ మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam