సినిమా ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు చాలామందికి నెగిటివ్ అభిప్రాయం ఉండేది. అలా అని ఇప్పుడేం మారిపోలేదు. కాకపోతే ఒకప్పటితో పోలిస్తే చాలావరకు తగ్గాయి. అయినా సరే పలువురు హీరోయిన్లు, లేడీ యాక్టర్స్ అప్పుడు తాము ఫేస్ చేసిన ఇబ్బందులను బయట పెడుతూ ఉంటారు. ఇలానే గత కొన్నేళ్ల ముందు మీటూ ఉద్యమం గట్టిగా నడిచింది. దీంతో పలువురు నటులు, టెక్నీషియన్స్.. తమని లైంగికంగా వేధించారని మీడియా ముందుకొచ్చి మరీ చెప్పారు. ఇలాంటి ఎప్పటికప్పుడూ చూస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం కాస్త డిఫరెంట్.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గతేడాది నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ వరల్డ్ వైడ్ ఫుల్ పాపులర్ అయింది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరినీ కూడా ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. ఇక ఈ సిరీస్ లో నంబర్ 1 అనే వృద్ధుడి పాత్రలో నటించిన ఓ యోంగ్-సుని కూడా అంత త్వరగా మర్చిపోలేం. ఎందుకంటే అతడిని బేస్ చేసుకునే సిరీస్ క్లైమాక్స్ ఎండ్ అవుతుంది. 78 ఏళ్ల వయసున్న ఓ యోంగ్.. ఓ మహిళని అనుచితంగా తాకిన సంఘటన 2017లో జరిగింది. దీనిపై గతేడాది డిసెంబరులో బాధితురాలు, ఇతడిపై ఫిర్యాదు కూడా చేసింది. కానీ ఈ ఏప్రిల్ లో ఈ కేసుని కొట్టేశారు. అయితే బీబీసీ కథనం ప్రకారం.. అధికారులు, బాధితురాలి అభ్యర్థన మేరకు.. మళ్లీ దర్యాప్తు తిరిగి ప్రారంభించారు.
‘సరస్సు చుట్టూ దారి చూపించడానికి మాత్రమే నేను ఆమె చేతిని పట్టుకున్నాను’ అని ఓ యోంగ్ సు చెప్పాడు. కొరియన్ న్యూస్ బ్రాడ్ కాస్టర్ తో మాట్లాడుతూ.. ‘నేను ఆవిడకు సారీ చెప్పాను. దాని గురించి గొడవ చేయనని చెప్పింది. అలా అని నేను ఆమె ఆరోపణలను అంగీకరించినట్లు కాదు’ అని యోంగ్ చెప్పాడు. ఇదిలా ఉండగా గత 50 ఏళ్లుగా ఓ యోంగ్ యాక్ట్ చేస్తున్నాడు. దక్షిణ కొరియా టీవీ సిరీస్ ‘చాక్లెట్’ లో కీలకపాత్ర పోషించారు. కానీ ‘స్వ్కిడ్ గేమ్’ వల్ల ఇతడికి వరల్డ్ వైడ్ పాపులారిటీ వచ్చింది. చాలామంది ప్రశంసించారు కూడా. ఇప్పుడు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.