Anudeep KV: కోలీవుడ్ హీరో శివ కార్తీకేయన్ హీరోగా ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కె.వి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రిన్స్’. ఏకకాలంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను డి.సురేష్ బాబు, నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే.. ఇదివరకే ఈ సినిమాను ఆగష్టు 31న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.
ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ మారి సినిమా ఇంకాస్త ముందుకు వాయిదా పడుతోంది. ఈ విషయాన్ని రిలీజ్ టైమ్ అనౌన్స్ మెంట్ అని వెరైటీగా ప్లాన్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ అనౌన్స్ మెంట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ కాన్సెప్ట్ లో డైరెక్టర్ అనుదీప్, హీరో శివకార్తికేయన్, హీరోయిన్ మరియా, సీనియర్ యాక్టర్ సత్యరాజ్ పాల్గొనడం మనం వీడియోలో చూడవచ్చు.
ఈ అనౌన్స్ మెంట్ వీడియోలో దర్శకుడు అనుదీప్ కె.వి, హీరో శివ కార్తీకేయన్ మధ్య జరిగిన సంభాషణ ఫన్నీగా ఉంటుంది. వీరితో పాటు సత్యరాజ్, హీరోయిన్ మరియా కూడా చేరి మరింత ఫన్ క్రియేట్ చేశారు. అనుదీప్, శివ కార్తీకేయన్ కలిసి సత్యరాజ్ కారణంగా సినిమా ఆలస్యమైందనడం.. ఆయన జాలి, దయ లేవని కామెంట్స్ చేశారు. ఇక్కడ ఎవరికీ జాలి, దయ లేదు అనే తమిళ పదాన్ని మాత్రమే దర్శకుడు అనుదీప్ నేర్చుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ప్రిన్స్ ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కాబోతుందని ప్రకటించారు. మరి ఈ వెరైటీ అనౌన్స్ మెంట్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.