‘నెలకి రూ.600 సంపాదించే సైనికుడి కోసం అన్నీ వదిలేసి వచ్చిన మహారాణి.. ఈ జన్మకి ఇక సెలవు’… ఈ ఒక్క డైలాగ్ చాలు ‘సీతారామం’ సినిమా డెప్త్ ఏంటో చెప్పడానికి. ఎందుకంటే సినిమా అంతా ఓ ఫ్లోలో వెళ్తుంది. మ్యూజిక్, యాక్టింగ్, విజువల్స్, డైరెక్షన్స్.. ఇలా ఒకటేమిటి ఏ విషయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘సీతారామం’ చూసి అందరూ చెప్పే ఒకే ఒక మాట అద్భుతం. అలాంటి ఈ సినిమాలో ఓ చిన్న లాజిక్ మాత్రం మిస్ అయింది. కాకపోతే దాన్ని పెద్దగా ఎవరూ గమనించినట్లు లేదు. ఇంకా చెప్పాలంటే పట్టించుకోలేదు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. లెఫ్టినెంట్ రామ్ రాసిన లేఖని సీత దగ్గరకు చేర్చాలి. 20 ఏళ్ల నుంచి పోస్టులో వేస్తున్నా సరే అది మళ్లీ రిటర్న్ వచ్చేస్తూనే ఉంది. దీంతో ఆ లెటర్ సీతకి చేర్చే బాధ్యత ఆఫ్రీన్ పై పడుతుంది. చాలామంది సాయం చేయడంతో ఆఫ్రీన్.. రామ్ రాసిన ఆ లెటర్ ని చివరకు సీతకు అందేలా చేస్తుంది. సినిమాకు శుభం కార్డు పడుతుంది. అంతా బానే ఉంది కానీ ఈ సినిమాలో పెద్ద లాజిక్ మిస్ అయింది. ఓటీటీలో ‘సీతారామమ్’ విడుదలైన తర్వాత ఈ మిస్టేక్ ని చాలామంది పసిగడుతున్నారు.
రామ్ కి సీత.. ప్రిన్సెన్స్ నూర్జహాన్ అని లెటర్ రాసే సమాయానికే తెలుసు. అదే విషయాన్ని లేఖలో కూడా చివరలో రాస్తాడు. ఓ పేపర్ క్లిప్పింగ్ ని కూడా జత చేస్తాడు. కానీ అడ్రస్ లో మాత్రం అసలు పేరు నూర్జహాన్ బదులు సీతామహాలక్ష్మి అని రాస్తాడు. దీంతో ఆ లెటర్ ని పోస్ట్ చేసిన పాక్ మేజర్ దగ్గరికి ప్రతిసారి రిటర్న్ వస్తూనే ఉంటుంది. ఇక లాభం లేదనుకుని ఫిక్స్ అయిన సదరు మేజర్.. తన మనవరాలు ఆఫ్రీన్ కి ఆ లెటర్ ని సీతకు చేర్చే బాధ్యత అప్పగిస్తాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ‘సీతారామం’ చూస్తూ ఆ ప్రపంచంలోకి వెళ్లిపోయిన ప్రేక్షకుడు.. ఈ లాజిక్ గురించి పెద్దగా పట్టించుకోడు. మీరు కూడా లాజిక్ ని వదిలేసి ‘సీతారామమ్’ అనే అనుభూతిని ఆస్వాదించండి. మరి ఈ లాజిక్ మిస్ కావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: సీతారామం సినిమా సీక్వెల్ ఉంటుందా.. దర్శకుడు ఏమన్నారంటే!
This scene ❤️🤏 #SitaRamamOnPrime @dulQuer @mrunal0801 pic.twitter.com/h6DFVFehuB
— Bulleteer Bharath (@Bharath007L) September 9, 2022