Vagdevi: ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ నిర్వహించిన ‘తెలుగు ఇండియన్ ఐడల్’ మొదటి సీజన్ లో యువగాయని బీవీకే వాగ్దేవి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తన మధురమైన కంఠంతో.. సంగీత జ్ఞానంతో ఆమె అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలుగు ఇండియన్ ఐడల్ ట్రోఫీతో పాటు రూ. 10 లక్షల నగదు బహుమతి కూడా అందుకున్నారు. ఆ వెంటనే గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మాణంలో ఓ సినిమాలో పాట పాడే అవకాశం చేజిక్కించుకున్నారు. అంతేకాదు! చిరంజీవి తన ‘గాడ్ ఫాదర్’ మూవీలో వాగ్దేవికి పాట పాడే అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో ప్రముఖ సింగర్ కార్తీక్ తాను సంగీతం అందించే తదుపరి చిత్రంలో వాగ్దేవికి అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇలా తన విజయంతో వరుస సింగింగ్ ఆఫర్లను సొంతంచేసుకున్న వాగ్దేవికి సినిమాల్లో హీరోయిన్గా కూడా ఆఫర్లు వస్తున్నాయని టాక్.
చిన్న చిన్న బ్యానర్ల దగ్గరి నుంచి పెద్ద బ్యానర్ల వరకు కూడా సినిమా ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. నేడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న కొందరు బుల్లితెర టాలెంట్ షోల ద్వారా హీరోయిన్లుగా ఎదిగారు. వారిలో ప్రముఖ హీరోయిన్లు సాయి పల్లవి, ఆండ్రియా జెర్మయ్యా ఉన్నారు. సాయి పల్లవి డ్యాన్స్ షో ద్వారా ఫేమ్ సంపాదించి ఆ తర్వాత హీరోయిన్గా మారారు. ఆండ్రియా సింగర్నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో వాగ్దేవి కూడా చేరబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు గనుక నిజమైతే సింగర్‌గా తనను తాను నిరూపించుకున్న వాగ్దేవి..
తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తారనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక, తెలుగు ఇండియన్ ఐడల్’ మొదటి సీజన్ లో వాగ్దేవి జూనియర్ పూజా హెగ్డేగా పేరు తెచ్చుకున్నారు. ప్రతిభకు అందం తోడైతే అచ్చం వాగ్దేవిలా ఉంటుందనటంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అయితే, ఈ ప్రచారాలపై ఇటు సినీ పరిశ్రమ వైపునుంచి గానీ, వాగ్దేవి తరపునుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ ప్రచారంలో వాస్తవం ఎంతుందో తెలియాలంటే వాగ్దేవి నుంచి ప్రకటన రావాల్సిందే. మరి, వాగ్దేవికి హీరోయిన్ ఆఫర్ అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : కవల పిల్లలకు జన్మనిచ్చిన సింగర్ చిన్నయి!