సిల్క్ స్మిత.. ఓ తరం కుర్రకారు ఈమె అందానికి దాసోహం అంది. ఆమె బావలు సయ్యా అని అనడమే ఆలస్యం. సై, సై.. అంటూ అంతా థియేటర్స్ కి పరుగులు తీశారు. తన అందంతో స్టార్ హీరో సినిమాలకి సైతం అందం అద్దిన ఘనత ఒక్క సిల్క్ స్మితకి మాత్రమే దక్కుతుంది. తాను బతికున్నంత కాలం నిర్మాతలకి కాసుల పంట పండించిన సిల్క్.. జీవిత చమరాంకంలో మాత్రం చాలా కష్టాలను అనుభవించి కన్ను మూసింది.
సిల్క్ స్మిత జీవితం ఆధారంగా బాలీవుడ్ లో విడుదలైన డర్టీ పిక్చర్ అప్పట్లోనే పాన్ ఇండియా స్థాయి హిట్ కొట్టిందంటే సిల్క్ స్మిత రేంజ్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. అయితే.., ఇప్పుడు అపురూప అందానికి సంబంధించిన ఓ పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో.., ఇప్పుడు ఎందుకు ఈ పిక్ వైరల్ అవుతుందా అన్న డౌట్ చాలా మందిలో ఉండిపోయింది.
సిల్క్ స్మిత అందాలను ఆరబోసే ఫోటోలు ఇంటర్నెట్ లో చాలానే ఉన్నాయి. కానీ.., ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ పిక్ లో ఎలాంటి అసభ్యత లేదు. స్మిత యవ్వనంలో ఉన్న సమయంలో తీసుకున్న ఫోటో. పైగా.. ఇది ఆమె ఫేవరేట్ పిక్. ఈ తరం స్టార్ హీరోయిన్స్ కి సైతం సాధ్యం కానంత అందంగా ఇందులో స్మిత కనిపిస్తోంది. దీంతో.. ఇది కదా నిజమైన అందం అంటూ నెటిజన్స్ ఈ పిక్ ని తెగ వైరల్ చేస్తున్నారు. మరి.. సిల్క్ స్మితపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.