శ్రీరెడ్డి.. రెండుతెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా వెలిగిపోవాలని వచ్చి.. చివరకు కాంట్రవర్సీలతో హైలెట్ అయ్యారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కి వ్యతిరేకంగా అర్థనగ్న ప్రదర్శన చేసి.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఇక సోషల్ మీడియాలో శ్రీరెడ్డి చేసే రచ్చ గురించి అందరికి తెలిసిందే. తాను టార్గెట్ చేసిన వాళ్లకు చుక్కలు చూపించే మాటలు మాట్లాడటం.. దీంతో పాటు అప్పుడప్పుడూ కాస్త గ్లామర్ ఒలకబోస్తూ స్పెషల్ కిక్కివ్వడం ఆమె నైజం. హీరోలు, రాజకీయ నాయకులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి గురించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గురించి శ్రీరెడ్డి చేసిన పోస్ట్ తెగ వైరలవుతోంది.
సోషల్ మీడియాలో మీమర్స్.. చాలా రకాలుగా మీమ్స్ క్రియేట్ చేసి నెట్టింట వైరల్ చేస్తుంటారు. ఇంకేముంది..వారి కన్ను శ్రీరెడ్డి పై పడ్డది. తాజాగా.. శ్రీ రెడ్డిపై ఓ మీమ్ క్రియేట్ చేసి వదిలారు. ఈ మీమ్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇందులో ఏముందంటారా..? శ్రీ రెడ్డి కోసం.. తెలంగాణాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే దీక్ష చేస్తున్నట్లుగా ఈ మీమ్ క్రియేట్ చేశారు. అంతేకాదు ‘శ్రీ రెడ్డి ఆవాహయామి’ అని కూడా రాసిపెట్టి ఉంది. ఇది చూసిన శ్రీరెడ్డి.. ఈ మీమ్‌ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ.. తనదైన స్టైల్లో కామెంట్ పెట్టింది.
“అందరకి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.. ఓ మై గాడ్.. పొలిటీషియన్ అంకుల్స్ కూడా నా కోసం దీక్ష చేస్తున్నారా? సో బ్యూటిఫుల్” అంటూ ట్యాగ్ లైన్ రాసింది. ఈ మేరకు సదరు మీమర్పై ప్రేమ వ్యక్తపరుస్తూ లవ్ సింబల్స్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కేవలం సరదా కోసమే తప్ప ఎవరినీ కించపరిచేందుకు పెట్టలేదు అంటూ రాసుకొచ్చింది” శ్రీ రెడ్డి. ఇది చూసి నెటిజన్లు.. ఓ రేంజ్లో కామెంట్లు పెడుతున్నారు.