ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ హోదాని సంపాదించుకుంటూ ఎంతోమంది వెలుగులోకి వస్తున్నారు. ఆల్రెడీ క్రేజ్ తెచ్చుకున్నవారు కొంతమంది ఇండస్ట్రీవైపు అడుగులు వేస్తుంటే.. మరికొందరు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా సోషల్ మీడియా క్రేజ్ తో సెలబ్రిటీ హోదా సంపాదించుకున్న వారిలో షణ్ముఖ్ జస్వంత్ ఒకరు. యూట్యూబ్ లో డాన్స్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులారిటీ అందుకున్న షన్ను.. బిగ్ బాస్ 5లో అడుగుపెట్టాక ఫ్యాన్ ఫాలోయింగ్ రెట్టింపు చేసుకున్నాడు.
ఇక షన్నుకి ‘సాఫ్ట్ వేర్ డెవలవ్ పర్’, సూర్య లాంటి వెబ్ సిరీస్ లు జనాలకి బాగా దగ్గర చేశాయి. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోతో సోషల్ మీడియాలో యంగ్ సినిమా హీరోలకు సమానమైన క్రేజ్ డెవలప్ చేసుకున్నాడు. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ అనే ఓటిటి వెబ్ సిరీస్ చేశాడు. ఇవన్నీ కాకుండా అడపాదడపా ప్రైవేట్ మ్యూజిక్ వీడియోస్ కూడా చేస్తూ వస్తున్నాడు. తాజాగా మరో ప్రైవేట్ వీడియో సాంగ్ తో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోయాడు. ‘జాను’ అనే టైటిల్ తో ఈ వీడియో సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. అయితే.. ఈ జానూ వీడియో సాంగ్ తో సుష్మిత శెట్టి అని కొత్త బ్యూటీని పరిచయం చేస్తున్నారు.
రీసెంట్ గా షణ్ముఖ్ సొంత ఛానల్ లో రిలీజ్ చేసిన జాను సాంగ్ ప్రోమోకి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ క్రమంలో షన్నుతో పాటు సాంగ్ లో ఉన్న కొత్త అమ్మాయి ఎవరా.. అని వివరాలు ఆరా తీసే పనిలో పడ్డారు ఫ్యాన్స్. కాగా.. షన్నుతో సాంగ్ లో కనిపిస్తున్న పేరు ‘సుష్మిత శెట్టి.. ఇన్ స్టాగ్రామ్ లో సుషీ అని పెట్టుకుంది. సుష్మితకి కూడా సోషల్ మీడియాలో లక్ష పైనే ఫాలోయర్స్ ఉన్నారు. రెగ్యులర్ గా రీల్స్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే.. పేరులో శెట్టి అని ఉండేసరికి ఈ అమ్మాయి తెలుగేనా? లేక కన్నడ అమ్మాయా అని సందేహపడుతున్నారు నెటిజెన్స్. పైగా ఇదివరకు వేరే ఏ వీడియో సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసినట్లు లేదు.
సో.. షన్ను వీడియో సాంగ్ ద్వారా సుష్మిత శెట్టి యూట్యూబ్ లో కూడా సూపర్ క్రేజ్ సొంతం చేసుకోబోతుంది. అంతేగాక జాను సాంగ్ కి కాన్సెప్ట్ తో పాటు కొరియోగ్రఫీని యశ్ మాస్టర్ అందించడం విశేషం. రొమాంటిక్ సాంగ్ రూపొందిన ఈ సాంగ్ లో లిరిక్స్ కూడా అలాగే ఉన్నాయి. షన్ను ఎనర్జిటిక్ డాన్స్ తో పాటు సుష్మిత క్యూట్ ఎక్సప్రెషన్స్ ని అందంగా కాప్చర్ చేశారు. వందన బండారి నిర్మించిన ఈ సాంగ్ ని సంగీతం అందించి పాడారు సందీప్ కూరపాటి. ఇప్పటివరకు షన్ను పక్కన కనిపించిన చాలామంది అమ్మాయిలు.. సోషల్ మీడియాలో మంచి పేరు సంపాదించుకున్నారు. మరి సుష్మితకి ఎలాంటి క్రేజ్ రానుందో చూడాలి. అయితే.. ప్రస్తుతానికి సుష్మిత శెట్టి అనే పేరు తప్ప.. ఆమె బయోడేటా ఏంటనేది ఇంకా తెలియలేదు. మరి కొత్తగా వెలుగులోకి వస్తున్న సుష్మిత శెట్టి గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.