సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ల వివాహం గురువారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి అందమైన ప్రేమ కావ్యాన్ని పెళ్లిబంధంతో పదిలపరుచుకున్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. నాను రౌడీదాన్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ లవ్ బర్డ్స్ గత లాక్‌డౌన్‌లో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక వీరి వివాహ వేడుకకు రజనీకాంత్, షారుక్ ఖాన్, రాధికా శరత్ కుమార్, దర్శకుడు అట్లీ తదితరులు హాజరయ్యారు. అయితే నయన్ పెళ్లికి షారుక్ ఖాన్ హజరుకావడం పట్ల కొంమదరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కరోనా వచ్చి కోలుకున్న వెంటనే పెళ్లికి హాజరకావడం అవసరమా? అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
నయనతార, విఘ్నేష్ ల వివాహాం అతి తక్కుమంది కుటుంబ సభ్యుల మధ్య అంగరంగవైభవంగా జరిగింేది. అయితే ఈ వేడుకకు కోలీవుడ్ స్టార్స్ రజనీకాంత్, సూర్య , విజయ్, అజిత్ కుమార్, విజయ్ సేతుపతితో పాటు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. బోనీ కపూర్ ,షారుక్ ఖాన్ నయన్ పెళ్లికి హాజయ్యారు. అయితే ఈసందర్భంగా షారుక్ పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానలతో ఫోటోలు దిగాడు. అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ షామిలీ షారుక్ తో దిగిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుని మురిసిపోయింది. అయితే వివాహ వేడుకల్లో ఖాన్ హాజరైనా ఫోటోలు చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే కరణ్ జోహార్ పుట్టిన రోజు వేడుకకు వెళ్లిన వారిలో కొందరికి కరోనా పాజిటీవ్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే.
Looking handsome, King! 🤎💛#ShahRukhKhan is on his way to #Nayanthara’s wedding. 💖💗 pic.twitter.com/5LAd7VtdlD
— Filmfare (@filmfare) June 9, 2022
ఆ పాజిటీవ్ వచ్చిన వారిలో షారుక్ ఖాన్ కూడా ఉన్నారు. కానీ అనంతరం వారం రోజులకే కరోనా నుంచి కోలుకవడంతో నయన, విఘ్నేష్ ల వివాహానికి హజరయ్యాడు. షారుక్ పై నెట్టిజన్ల ట్రిలింగ్స్ కి ఇదే కారణం. ఇటీవలే కరోనా వచ్చి, తగ్గగానే వెంటనేపెళ్లికి వెళ్లడం అవసరమా? అని పలువురు షారుక్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఇక షారుక్ విషయానికి వస్తే..’రాజారాణి’, ‘బిగిల్’, ‘మెర్సల్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్లు అందించిన తమిళ దర్శకుడు అట్లీతో ‘జవాన్’ అనే సినిమా చేస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది జూన్ 2న ఈ చిత్రం విడుదల కానుంది. మరోవైపు హిరానీతో ‘డంకీ’ మూవీ చేస్తున్నాడు షారుక్. అలాగే మాధవన్ ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’, రణ్‌బీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాల్లో అతిథిగా కనిపించనున్నాడు. అయితే ప్రస్తుతం షారుక్ ఖాన్ పై ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ ట్రోలింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
All dressed up! 💖💗💓#ShahRukhKhan, #Atlee and SRK’s manager, Pooja Dadlani pose for a picture at #Nayanthara and #VigneshShivan’s wedding. pic.twitter.com/1rBD6NlLQS
— Filmfare (@filmfare) June 9, 2022