అదొక అందమైన కుటుంబం…
వారిది అన్యోన్య దాంపత్యం…
అయితే భార్య పుట్టిన రోజున ఆమెకు బర్త్ డే విషెస్ కూడా చెప్పకుండా నీట్ గా ముస్తాబై ‘కలవరమాయే మదిలో… అంటూ ఓల్డ్ క్లాసిక్ పాడుకుంటున్న భర్తకు హారతి ఇస్తూ నిష్టూరంగా ‘ ఇవాళ ఏంటో గుర్తుందా… అని అడిగితే ‘ ఇంటి అద్దే కదా ..కట్టేదాం..’ అంటాడు. ఇంతలో అతని సెల్ ఫోన్ మోగింది. స్క్రీన్ మీద బంగినపల్లి మామిడి పండు లాంటి ఒక అందమైన లేడీ ఫోటో కనిపిస్తుంది. అతను కంగారు పడుతూ ఫోన్ చేతిలోకి తీసుకుని ‘ఏరా.. గౌతమ్ ఇదిగో వచ్చేస్తున్నాను రా ‘ అంటూ హడావుడిగా బయటపడతాడు.
ఆ ఫోన్ రాగానే అతను కంగారు పడటం… అమ్మాయి ఫోన్ చేస్తే అబ్బాయితో మాట్లాడుతున్నట్టుగా నటించడం.. ఎవరో తరిమినట్లుగా అక్కడి నుండి జారుకోవడం… ఇవన్నీ చూసి ఆమెలో అనుమానం బలపడింది. అసూయతో రగిలి పోయింది… ఆ తరువాత ఏం జరిగింది..? ఏం జరిగిందో చూడాలంటే మీరు అర్జెంటుగా ఒక్క నిమిషం తొమ్మిది సెకండ్ల ఈ షార్ట్ ఫిలిం చూడాల్సిందే.. మరెందుకాలస్యం చూసేయండి …
చూశారుగా.. ఈ షార్ట్ అండ్ స్వీట్ ఫిలింలో మధ్య తరగతి సగటు భర్త పాత్రలో మెగాస్టార్ చిరంజీవిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు తెలుగు ప్రజలు. అవును… నిజంగా ఇదొక షాకింగ్ సర్ ప్రైజ్. మెగాస్టార్ చిరంజీవిని ఇలాంటి ఒక డొమెస్టిక్ కంటెంట్ లో చూడటం చాలా చాలా ముచ్చటగా అనిపించింది కదా.! మెగాస్టార్ చిరంజీవి, ఒకప్పటి టాప్ హీరోయిన్, తమిళ తంబీల ఆరాధ్య నటి కుష్బూ, ఆడవాళ్ళలో కూడా అసూయను రగిలించే సౌష్టవ సుందరి అనసూయ నటించిన ఈ యాడ్ ఫిలింను ఇంత ఆహ్లాదంగా మలిచిన సెన్సేషనల్ డైరెక్టర్ ఎవరో తెలుసా..? గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి తాజాగా’ పుష్ప’ ద్వారా మరో విధ్వంసకర విజయాన్ని సొంతం చేసుకున్న క్రియేటివ్ జీనియస్… అదేనండి మన లెక్కల మాస్టారు… సుకుమారే ఈ యాడ్ ఫిలింను డైరెక్ట్ చేసింది. నిజంగా ఈ కాన్సెప్ట్ ను ఇంత సింపుల్ గా, సెన్సిటివ్ గా, సెన్సిబుల్ గా డీల్ చేసిన సుకుమార్ కు హాట్సాఫ్.
మధ్యతరగతి లివింగ్ స్టాండర్డ్స్ కు తగ్గట్లుగా ఆ షర్టు… ఆ ఇన్ షర్ట్…, ఆ కళ్ళజోడు… ఆ తడబాటు… ఆ లవ్…. ఆ సెంటిమెంట్ … నిజానికి ఆ మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్ గెటప్ లో భలే ముచ్చటగా అనిపించారు చిరంజీవి. ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య… మగ మహారాజు, విజేత వంటి ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రాలు గుర్తుకు వచ్చాయి కదూ..! భార్య అనుమానం, అపోహ, అపార్థాల నుండి ఒక అందమైన నిజాన్ని చెప్పించిన ఈ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు ఈ యాడ్ మరలా ఎప్పుడు, ఏ టీవీలో వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి చూడటం ఖాయం. గతంలో దివంగత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు పలికిన “అందమైన ఊహకు పొందికైన రూపం “… అనే క్యాప్షన్ ను ఇప్పుడు ఇందులో మెగాస్టార్ చిరంజీవి చెప్పారు…. but with a different style and modulation…దీనిని ” మెగాస్టార్ ఇమేజ్ కి సుకుమార్ ఇచ్చిన కొత్త రూపం”.. అని చెప్పవచ్చు . ఈ యాడ్ లో ఖుష్బూ పేరు రేఖ… ఇది ‘సురేఖ’ నుండి తీసుకున్న’ రేఖ’ కావటం ” చిరు.. సుకుమార్ “ల చిలిపితనం అనే అనుకోవాలి. మొత్తానికి అడ్వర్టైజ్ మెంట్ రంగంలో ఈ యాడ్ కొన్ని సంవత్సరాలపాటు గొప్ప వ్యూయర్ షిప్ సాధించటం ఖాయం….
ఇదిలా ఉంచితే పాపులర్ స్టార్స్ ప్రముఖ బ్రాండ్స్ కు యండార్స్మెంట్స్ చేయటం సర్వసాధారణం. చిరంజీవి కూడా గతంలో “థమ్సప్”కు అంబాసిడర్ గా చేశారు. అయితే కొన్ని అనుచిత వ్యాఖ్యలు’ విమర్శలు రావటంతో పాటు ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఆయన మరలా యాడ్స్ చేయలేదు. “ఖైదీ నెంబర్ 150” తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి ఇప్పుడు మరలా ఎండార్స్మెంట్స్ చేయటానికి అంగీకరించటం అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎన్నెన్నో సేవా, సహాయ, సౌజన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న చిరంజీవి ఎండార్స్మెంట్స్ చేయడం ద్వారా వచ్చే డబ్బులో అధిక భాగాన్ని చారిటీకే వినియోగిస్తారు అన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయాన్ని, వ్యక్తుల నుండి ఎలాంటి విరాళాలను తీసుకోకుండా నెలకు 15 లక్షలకుపైగా బ్లడ్ అండ్ ఐ బ్యాంకుల నిర్వహణకు ఖర్చు చేస్తుంటారు చిరంజీవి. అంతేకాకుండా కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్ స్టేషన్స్ స్థాపనకు కోట్లాది రూపాయలు వెచ్చించారు చిరంజీవి. అలాగే ఆపదలో ఉన్న సహ నటీనటులు, టెక్నీషియన్స్ పట్ల చిరంజీవి ఎలాంటి వితరణ ప్రదర్శిస్తుంటారో జగద్విదితమే. ఇప్పుడు చాలా కాలం తరువాత చిరంజీవి ఎండార్స్ మెంట్స్ ఒప్పుకోవడం వల్ల ఆ సేవా కార్యక్రమాలను మరింత ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఏర్పడుతుంది. అందుకే let us welcome back Mega Star Chiranjeevi to do endorsments frequently and continuesly…
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.