నెపోలియన్ ఒక తమిళ నటుడు, రాజకీయ నాయకుడు మరియు పారిశ్రామికవేత్త. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విలన్ గా నటించిన నెపోలియన్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. తెలుగులో హలో బ్రదర్, రాయలసీమ రామన్న చౌదరి, ఓయ్, సలీం వంటి సినిమాల్లో నటించారు. భారతీయ సినిమాల్లోనే కాకుండా పలు హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. సింగర్ గా కూడా తన అభిరుచిని చాటుకున్న నెపోలియన్.. రాజకీయాల్లో కూడా చక్రం తిప్పారు. కొడుకు అనారోగ్యం కారణంగా రాజకీయాల నుంచి తప్పుకున్న నెపోలియన్.. ప్రస్తుతం కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే సొంతంగా ఒక కంపెనీ నడుపుతూ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు.
తాజాగా అమెరికాలో ఉన్న తన లగ్జరీ ఇంటిని చూపిస్తూ.. హోమ్ టూర్ వీడియో ఒకటి చేశారు. అమెరికాలోని టెనస్సీలో నష్విల్లెలో ఉంది ఆయన ఇల్లు. 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మన భాషలో 27 సెంట్లు పైనే. 27 సెంట్లలో ఇల్లు అంటే ఎంత విశాలంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈయన అమెరికాలోని సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్. ఈయనకి కునాల్, ధనుష్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ధనుష్ దివ్యాంగుడు కావడంతో వీల్ చైర్ కి పరిమితమయ్యాడు. అయితేనేం యువరాజులా బతుకుతున్నాడు. ఏం కావాలన్నా అయన దగ్గరకు వచ్చేలా సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఆయన తండ్రి. రాజభవనాన్ని తలపించేలా విశాలమైన భవంతిలో అనేక వసతులతో కొడుకు కోసం ప్రత్యేకంగా ఇంటిని రూపొందించారు నెపోలియన్.
సూర్యరశ్మి అనేది చాలా అవసరం. సూర్యరశ్మి నుంచి శరీరానికి కావాల్సిన విటమిన్ డి దొరుకుతుంది. అమెరికాలో విటమిన్ డి కోసం ప్రత్యేకంగా ఒక గదిని నిర్మించుకుంటారు. అదేనండి.. సూర్యకాంతి ఇంట్లో పడేలా ఒక గదిని ఏర్పాటు చేసుకుంటారు. అలా నెపోలియన్ కూడా తన ఇంట్లో సూర్యకాంతి ప్రసరించేలా ఒక గదిని సెట్ చేసుకున్నారు. ఇదే ఆయనకి ఫేవరెట్ స్పాట్ అంట. ఇక్కడి నుంచి ఇంటి యొక్క ఎక్స్టీరియర్ అందాన్ని చూడవచ్చు.
బాత్ టబ్ సహా అనేక ఫుల్లీ ఎక్విప్డ్ మెటీరియల్స్ తో ఉంటుంది. బాత్రూమ్ కి దగ్గర్లో ప్రత్యేకంగా బట్టలు పెట్టుకోవడానికి వేరే రూమ్ కూడా ఉంది. అన్ని గదులూ ఇంటర్ కామ్ సదుపాయం కలిగి ఉన్నాయ్. అంటే ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్లేలా ఏర్పాటు చేసుకున్నారు.
అమెరికాలో స్థిరపడటంతో భారత్ తన ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను అమెరికా తీసుకెళ్లిపోయారు. ఇక్కడ ఉన్న దేవుళ్ళ విగ్రహాలను తీసుకెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి కూడా తీసుకున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.
నెపోలియన్ ఇంట్లో 4 లగ్జరీ కార్లు ఉన్నాయి. నెపోలియన్ కి ఒక టొయోట కారు ఉంది. దీన్ని ఆయన వ్యక్తిగత పని మీద వాడతారు. కుటుంబం కోసం లిఫ్ట్ ఎక్విప్డ్ వ్యాన్ ఉంది. తన కొడుకుల కోసం 2 కార్లు కొన్నారు. ఒకటి బెంజ్, మరొకటి టెస్లా.
ఇంటి కింద సెల్లార్ లో వైన్ సెల్లార్ ఒకటి ఉంది. అమెరికా వాసులకి డైలీ వైన్ తాగడం ఒక అలవాటు. అలా ఈయన ఇంటి కింద సెల్లార్ లో వైన్ షాపే ఉంది. అయితే ఈయనకి మందు అలవాటు లేదు. కానీ తాగడానికి స్నేహితులు వస్తే మాత్రం వివిధ వైన్ బాటిల్స్ ని కొని పెడతారట.
ఇంట్లోహోమ్ థియేటర్ కూడా ఉంది. ఈయన నటించిన సినిమాల్లోని పోస్టర్స్ ని హోమ్ థియేటర్ లో గోడకి తగిలించుకున్నారు. సెలవు దినాల్లో ఆయన తల్లిదండ్రులు ఈ హోమ్ థియేటర్ లోనే ఉంటారని ఆయన అన్నారు.
ఇంట్లో బాస్కెట్ బాల్ కోర్టు ఉంది. బయట రియల్ బాస్కెట్ బాల్ కోర్టు ఎంత పెద్దగా ఉంటుందో అంతే పెద్దగా ఈయన తన ఇంట్లో నిర్మించుకున్నారు. ఇంట్లో ఒరిజినల్ బాస్కెట్ బాల్ కోర్టుని నిర్మించుకున్నారు. ఈయన తన కోసం ఈ బాస్కెట్ బాల్ కోర్టుని నిర్మించుకున్నారట. చిన్నప్పటి నుంచి బాస్కెట్ బాల్ ప్లేయర్ కావడం వల్ల ఈయన బాస్కెట్ బాల్ ఆడుతారట. ఆయన కొడుకుకి కూడా బాస్కెట్ బాల్ అంటే ఆసక్తి అని చెప్పారు.
ధనుష్ యూట్యూబ్ స్టార్ ఇర్ఫాన్ కి పెద్ద ఫ్యాన్. ఇర్ఫాన్ ని కలవడం కోసం అమెరికాలో ఉంటున్న ఇంటికి పిలిపించుకున్నారు. అమెరికా వెళ్తున్నాడు కాబట్టి పనిలో పనిగా హోమ్ టూర్ చేస్తే బాగుటుందనిపించి ఇర్ఫాన్ ఇలా నెపోలియన్ హోమ్ టూర్ చేశారు. ఆ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇల్లా? లేక రాజభవనమా? అని నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇక పోలియన్ కి తన కొడుకు అంటే చాలా ఇష్టం. తన కొడుకు కోసం ఇంటిని అనేక రకాలుగా మార్చారు.
తాను 12 ఏళ్ల క్రితం అమెరికా వచ్చానని, తాను ఉంటున్న ఇంటిని 6 ఏళ్ల క్రితమే కొన్నానని.. తన కొడుకు అభిరుచికి తగ్గట్టు దాన్ని చాలా మార్పులు చేసుకొచ్చానని ఆయన వెల్లడించారు. స్టార్ హీరోల రేంజ్ లో నటుడు నెపోలియన్ లగ్జరీ హౌజ్ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఆయన నటుడు మాత్రమే కాకుండా.. వ్యాపారవేత్తగా ఉండడం.. అమెరికాలో సొంతంగా కంపెనీ నడుపుతుండడం వల్ల ఇంత విశాలమైన భవనంలో ఉంటున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి నెపోలియన్ రాజభవనాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.