హీరోహీరోయిన్లు పబ్లిక్ ఫిగర్స్. అంటే బయట ఎక్కువగా కనిపిస్తుంటారు. అభిమానులకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అలా అని వారి వ్యక్తిగత విషయాల్లోకి మనం ఎంటర్ అవుతామంటే కుదరదు. అందుకే ఎంత మూవీస్ లో నటిస్తున్నా సరే కొన్ని లిమిట్స్ పెట్టుకుంటారు. వాటిలోకి బయటవాళ్లని రానివ్వకుండా చూసుకుంటారు. ఇప్పుడు సేమ్ అలాంటి ఇన్సిడెంటే జరిగినట్లు కనిపిస్తుంది. దీంతో ఓ స్టార్ హీరోయిన్ కారులో దాక్కుని మరీ పోయింది. అసలు ఇంతకీ ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగు హీరోయిన్లు పెద్దగా బయటకు కనిపించరు. బాలీవుడ్ లో అంటే ముంబయిలో మాత్రం రెగ్యులర్ బయట, అది కూడా జిమ్ ఔట్ ఫిట్ లో కనువిందు చేస్తుంటారు. వీళ్లని క్యాప్చర్ చేసేందుకు ప్రత్యేకించి పలువురు ఫొటోగ్రాఫర్స్ కూడా జిమ్ సెంటర్స్ దగ్గరే ఉంటారు. దీంతో సదరు హీరోయిన్లకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. అయితే కొన్నిసార్లు ఫ్యాన్స్ చేసిన శ్రుతిమించిన పనుల వల్ల సదరు బ్యూటీస్ ఇబ్బంది పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఇకపోతే తాజాగా హీరోయిన్ సారా అలీఖాన్ విషయంలో అలాంటిదే జరిగినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే జిమ్ లో వర్కౌట్స్ చేసిన ఆ భామ.. వచ్చి రాగానే కారులోకి ఎక్కేసింది. కానీ ఫొటోగ్రాఫర్స్ కంటపడకుండా పూర్తిగా దాక్కుండిపోయింది. దీంతో అక్కడున్న వారు.. సారాకు ఏమైందా అనుకున్నారు. అయితే ఫొటోగ్రాఫర్స్ కంటపడుకుండా, ఫోన్ యూజ్ చేసేందుకు ఆమె అలా చేసినట్లు అనిపిస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సారా అలీఖాన్ చేతిలో రెండు సినిమాలున్నాయి. మొన్నటికి మొన్న ఆమె యంగ్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో కనిపించడం కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.