ఈమె స్టార్ హీరోయిన్. ఆలోవర్ ఇండియా ఈ బ్యూటీకి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడేమో ఆల్రెడీ పెళ్లయి విడాకులు తీసుకున్న ఓ హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె ఎవరో కనిపెట్టారా?
ఈమె స్టార్ హీరోయిన్. ఆల్రెడీ ఓసారి పెళ్లి చేసుకుంది. కాకపోతే అది ఎక్కువ కాలం నిలబడలేదు. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు ఓటీటీలోనూ సిరీసుల్లో నటిస్తూ వెళ్తోంది. అలాంటి ఈమె.. ఓ స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి చాలాసార్లు మీడియా కంటపడ్డారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈమె పుట్టింది తెలంగాణలోనే. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈమె హీరోయిన్ గా తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా క్రేజ్ మాత్రం బాగానే సంపాదించింది. 2006 నుంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. 2018లో ‘సమ్మోహనం’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. హిట్ ఫ్లాప్ సంగతి పక్కనబెడితే తన క్యూట్ నెస్ తో మెస్మరైజ్ చేసింది. అవును మీరు ఊహించింది కరెక్ట్. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి అదితీ రావు హైదరీ. టాలీవుడ్ లో ఇప్పటివరకు జస్ట్ నాలుగే సినిమాలు చేసింది. ఫేమ్ మాత్రం చాలా సొంతం చేసుకుంది.
‘సమ్మోహనం’తోపాటు ‘అంతరిక్షం’, ‘మహా సముద్రం’, ‘వి’ సినిమాల్లో ఈ బ్యూటీ హీరోయిన్ గా చేసింది. హిందీలో మాత్రం సినిమాలతో పాటు ఓటీటీల్లో వెబ్ సిరీసులు చేస్తూ అదితీ చాలా పేరు తెచ్చుకుంది. హిందీ నటుడి సత్యదీప్ మిశ్రాని 2002లో పెళ్లి చేసుకుంది. 2012లో అతడికి విడాకులు ఇచ్చేసింది. అప్పటినుంచి సింగిల్ గానే ఉంటుంది. రీసెంట్ టైంలో హీరో సిద్ధార్థ్ తో ఈ బ్యూటీ రిలేషన్ లో ఉన్నట్లు బయటపడింది. అయితే వీళ్లు పెళ్లి చేసుకుంటారా? ఇలానే రిలేషన్ షిప్ మెంటైన్ చేస్తారా అనేది తెలియదు. మరి ఈ బ్యూటీ చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.