ఈ మద్య సెలబ్రెటీలకు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు రావడం చూస్తూనే ఉన్నాం. పలువురు నేతలు, నటులకు మీ ఇంట్లో బాంబు పెట్టాం అంటూ బెదిరింపులకు పాల్పపడుతున్నారు. ఇలాంటి ఫేక్ కాల్స్ కొంత మంది ఆకతాయిలు చేసినట్లు తెలియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి ఓ బెదిరింపు లేఖ రావడం ఇండస్ట్రీ కలకలం సృష్టించింది. సల్మాన్ ఖాన్ తో పాటు అతని తండ్రి సలీమ్ ఖాన్ ని కూడా చంపేస్తాని ఆ లేఖలో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే..
పంజాబీ సింగర్ సిద్ధూ మూస్ వాలాలాను హతమార్చినట్టే సల్మాన్‌ను కూడా హతమారుస్తామని ఈ లేఖలో బెదిరించారు. ఆ లేఖను తన కుమారుడు సల్మాన్ ఖాన్ కి ఇవ్వడంతో వెంటనే ఆయన బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆ లేఖ రాసిన అగంతకుడు ఎవరు అన్న విషయం పై దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే పంజాబీ సింగర్ సిద్ధూ దారుణ హత్యకు గురి కావడంతో పలువురుసెలబ్రెటీలకు భద్రత పెంచారు. ఇందులో సల్మాన్ ఖాన్ కూడా ఉన్నారు. మూస్ వాలాలాను హత్య చేసిన ప్రధాన నిందితుడు గ్యాంగ్‌స్టార్ లారెన్స్ బిష్టోయ్ అన్న సంగతి తెలిసిందే. గతంలో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ ప్రమేయం ఉన్నందున సల్మాన్ ను హత్య చేస్తానని బిష్ణోయ్ బెదిరించాడు.
ఇవి కూడా చదవండి : Divya Pandey: సివిల్స్‌లో 323వ ర్యాంకు వచ్చిందని సంతోష పడింది.. అంతలోనే..
ఇటీవల బిష్ణోయ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని చంపేందుకు రెక్కీ నిర్వహించేందుకు ముంబైకి వెళ్లాడని పోలీసులు కనుగొన్నారు. 2020 ఒక హత్య కేసులో బిష్ణోయ్ సహచరుడు రాహుల్ అలియాస్ సన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారిస్తున్న సమయంలో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారు. తమ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేసినట్లు రాహూల్ తెలిపాడని పోలీసులు అన్నారు. ఈ క్రమంలో సల్మాన్‌కు భద్రతను రెట్టింపు చేశారు. అయితే ఈ విషయం విన్న సల్మాన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Maharashtra | Actor Salman Khan & his father Salim Khan received a threat letter, today. Bandra Police has filed an FIR against an unknown person & further probe is underway: Mumbai Police
(File pic) pic.twitter.com/wAKZlgHNH2
— ANI (@ANI) June 5, 2022