ఈరోజుల్లో సినిమాల్లో బెడ్ రూమ్ సన్నివేశాలు కామన్ అయిపోయాయి. బేబి సినిమాలో వైష్ణవి చైతన్య బెడ్ రూమ్ సీన్ లో నటించింది. అయితే ఈ సీన్ ని తీసే ముందు దర్శకుడు ఏం చేశాడో తెలిస్తే ఇలా కూడా ఉంటారా మనుషులు అని అనుకుంటారు.
కంటెంట్ బాగుంటే సినీ ప్రేక్షకులు ఆదరిస్తారని బేబి సినిమా మరోసారి రుజువు చేసింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అంచనాలు లేకుండా వచ్చి పెద్ద విజయం సాధించింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్స్‌గా సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్.కె.ఎన్ నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘బేబి’. జూలై 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు రూ. 66 కోట్ల వరకూ రాబట్టిందని సమాచారం. వైష్ణవి చైతన్య నటనకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఎంతలా అంటే ఆమె చేసిన పాత్రను దారుణంగా తిట్టేంతగా క్యారెక్టర్ ని ఓన్ చేసేసుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో బెడ్ రూమ్ సీన్ ని వైష్ణవి తండ్రిని అడిగి చేశానని దర్శకుడు సాయి రాజేష్ అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు సాయి రాజేష్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో ఉన్న బెడ్ రూమ్ సీన్ గురించి వైష్ణవి తండ్రితో చర్చించానని అన్నారు. ఆమె తండ్రికి ఈ సీన్ పూర్తిగా వివరించానని, సీన్ టూ సీన్ ఇలా ఉంటుందని చెప్పానని అన్నారు. మీకు నచ్చితేనే తీస్తానని, లేదంటే వేరే లాగా ట్రై చేద్దామని చెప్పడంతో వాళ్లు ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాదు వైష్ణవితో తన కెరీర్‌కు ఏమైనా ప్రాబ్లమ్ అయితే పూర్తి బాధ్యత తనదే అని చెప్పానని.. మూడు సినిమాల్లో అవకాశం ఇస్తానని ప్రామిస్ కూడా చేశానని అన్నారు.
దీంతో సాయి రాజేష్ వ్యక్తిత్వానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇలా కూడా ఉంటారా? వైష్ణవి తండ్రిని ఒప్పించి మరీ సీన్ తీశారా? ఒప్పుకోకపోతే ఆ సీన్ ని మార్చాలని అనుకున్నారా అంటూ సాయి రాజేష్ ని ప్రశంసిస్తున్నారు. ఒక సినిమాకి సైన్ చేసిన తర్వాత ఇంట్లో వాళ్లకు ఇష్టమున్నా లేకున్నా ఎలాంటి సన్నివేశాలు ఉన్నా హీరోయిన్ చేయాల్సిందే. ఈ విషయంలో దర్శకుడు ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అన్నట్టు ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే హీరోయిన్ ని మార్చేస్తారు. కానీ సాయి రాజేష్ మాత్రం ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించి నొప్పించకుండా సీన్ ని తీశారు. ఇలాంటి దర్శకులు కూడా ఉంటారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి బేబీ సినిమాలో బెడ్ రూమ్ సీన్ కోసం వైష్ణవి చైతన్య తండ్రిని అనుమతి అడిగిన సాయి రాజేష్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.