హీరోయిన్లలో మిగతావాళ్లతో పోలిస్తే ఈమె క్రేజ్ వేరే లెవల్. మేకప్ వేసుకోకపోయినా కిరాక్ ఉంటుంది. యాక్టింగ్ లో అయితే తోపు అని చెప్పాలి. ఎవరో గుర్తుపట్టారా?
సాధారణంగా హీరోయిన్లు మేకప్ వేసుకుంటారు. ఉన్నదాని కంటే మరింత అందంగా కనిపించే ప్రయత్నం చేస్తారు. ఈ బ్యూటీ మాత్రం అస్సలు అలా కాదు. నార్మల్ గా ఎలా అయితే కనిపిస్తుందో ఆల్మోస్ట్ సినిమాలోనూ అలానే ఉంటుంది. చేసిన సినిమాలు వేళ్లపై లెక్కపెట్టే అన్ని మాత్రమే ఉంటాయి. కానీ ప్రతి మూవీలోని తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసింది. ఇక డ్యాన్స్ చేసిందంటే.. యూట్యూబ్ లో ఆ పాటలు మిలియన్స్ కొద్ది వ్యూస్ తో సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేస్తాయి. ఇంతలా చెప్పాం కదా ఆమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో చాలా పద్ధతిగా సాయిబాబా నిలబడిన ఈ పాపకు ఆయన గుర్తుగానే ఓ పేరు పెట్టారు. స్వతహాగా డాక్టర్ అయిన ఈ బ్యూటీ.. అదే టైంలో హీరోయిన్ గా స్టార్ హోదా దక్కించుకుంది. ఆమె ఎవరో కాదు సాయిపల్లవి. ఈ రోజు ఆమె పుట్టినరోజు. తమిళనాడులోని కోటగిరిలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. టీనేజ్ లో ఓ రెండు సినిమాల్లో గుర్తింపు లేని పాత్రలు చేసింది. మలయాళంలో 2015లో వచ్చిన ‘ప్రేమమ్’తో ఫుల్ టైమ్ హీరోయిన్ గా మారిపోయి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
దీంతో ఈమెకు సౌత్ లో అవకాశాలు వచ్చిపడ్డాయి. కానీ వాటిలో చాలావరకు జాగ్రత్తగా పిక్ చేసుకుని మరీ మూవీస్ చేసింది. ‘ఫిదా’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత MCA, పడిపడి లేచే మనసు, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరి, విరాటపర్వం.. ఇలా చాలా తక్కువనే సినిమాలు చేసింది. క్రేజ్ మాత్రం ఏ హీరోయిన్ కి సాధ్యపడని రీతిలో సొంతం చేసుకుంది. గతేడాది చివరగా ‘గార్గి’తో ప్రేక్షకుల్ని పలకరించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఖాళీగా ఉంది. బహుశా సినిమా స్టోరీలు నచ్చకపోవడమో, లేదా పెళ్లి చేసుకునే ఆలోచన ఉండటమో.. ఇంకేదైనా కారణం ఉందా అనే డౌట్ వస్తోంది. మరి ఈ హీరోయిన్ చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.