పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో వేగం పెంచారు. మొన్న వకీల్ సాబ్, ఇటీవల భీమ్లా నాయక్ సినిమాలతో సూపర్ హిట్లను ఖాతాలో వేసుకున్నారు. తాజాగా పవన్ కళ్యాన్ మరో రీమేక్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. ప్రముఖ నటుడు సముద్రఖని నటించి తెరకెక్కించిన ‘వినోదయ సిత్తం‘ అనే సినిమాకి పవన్ ఓకే చెప్పాడని టాక్ బలంగా వినిపిస్తుంది.
ఇప్పటికే సక్సెస్ ఊపులో ఉన్న పవన్ కళ్యాణ్.. పీరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’ని కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడట.. ఆ వెంటనే ఈ రీమేక్ సినిమాలో నటించనున్నారని కథనాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో కీలకపాత్ర కోసం 20 రోజులే కేటాయించడని.. అందుకోసం పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ కూడా భారీగా తీసుకోనున్నాడని ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ కి కూడా సముద్రఖనియే దర్శకత్వం వహిస్తారని.. అలాగే ఈ సినిమాలో పవన్ తో పాటు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ లేదా వైష్ణవ్ తేజ్ మరో పాత్రలో కనిపిస్తారని టాక్. అయితే. ఈ రీమేక్ సినిమా కోసం 20 రోజులకు గానూ పవన్ కళ్యాణ్ సుమారు 50 కోట్లు రెమ్యూనరేషన్ అందుకోనున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. పవన్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని మేకర్స్ కూడా అంత ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట.
ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్.. పింక్ మూవీకి రీమేక్, లేటెస్ట్ భీమ్లా నాయక్.. అయ్యప్పనుమ్ కోషియుమ్ మూవీకి రీమేక్ అనే సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు వినోదయ సిత్తం కూడా రీమేక్ మూవీ కావడంతో పవన్ ఫ్యాన్స్ ఈ విషయంలో నిరాశ పడుతున్నట్లు సమాచారం. వరుసగా రీమేక్ సినిమాలు చేస్తున్నాడని.. కొత్త స్టోరీలు కావాలని ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ పవన్ మాత్రం ఆల్రెడీ వినోదయ సిత్తంకి ఓకే చెప్పేసాడని.. త్రివిక్రమ్ కూడా అదే స్క్రిప్ట్ పనిలో ఉన్నాడని అంటున్నారు. మరి ఏ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.