ఐశ్వర్య రాయ్.. భారతీయ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన అందమైన కళ్లతో కుర్రకారు మనస్సును కట్టి పడేస్తుంది ఈ మాజీ ప్రపంచ సుందరి. ఐశ్వర్య బచ్చన్ అనేక చిత్రాల్లో నటించి.. ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది ఈ బాలీవుడ్ భామ. స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే అభిషేక్ బచ్చన్ తో ప్రేమలో పడి.. పెళ్లి చేసుకుంది. ఆపై వారిద్దరికి ఆరాధ్య జన్మించింది. ప్రస్తుతం ఆరాధ్య వయస్సు పదేళ్లు. అయితే తాజాగా ఐశ్యర్య రాయ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఐశ్వర్య రాయ్ మళ్లీ ప్రెగ్నెంట్ అని టాక్ వినిపిస్తోంది.
ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఐశ్వర్య బచ్చన్ కనిపించారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ కావడంతో అందరిలో ఈ డౌట్ మొదలైంది. భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్యతో కలిసి ఐశ్వర్య ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. ఓవర్ సైజ్ ఉన్న బ్లాక్ దుస్తుల్లో ఐశ్వర్య తన కుమార్తెను పట్టుకుని వెళ్లడం సోషల్ మీడియాలో కామెంట్లకు దారి తీసింది. అభిషేక్ పింక్ స్విట్షర్ట్లో ఎయిర్పోర్ట్ వచ్చాడు. అయితే ఐశ్వర్యకు బేబీ బంప్ ఉన్నట్లు ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. లాంగ్ కోట్ ధరించిన ఆమె బంప్‌ను దాచిపెట్టినట్లు కొందరు కామెంట్ చేశారు.
మణిరత్నం డైరెక్ట్ చేసిన పొన్నియన్ సెల్వన్‌లో ఐశ్వర్య నటిస్తోంది. పుజావూర్ రాణి నందిని పాత్రను ఆమె పోషిస్తోంది. దేవదాస్, ధూమ్ 2, జోధా అక్బర్, మోహబత్తేన్, గురు, గుజారిష్, తాల్, జోష్, రోబో, రావణ్, ప్రియురాలు పిలిచింది, సర్కార్ లాంటి ఎన్నో హిట్ చిత్రాలు ఐశ్వర్య రాయ్ ఖాతాలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఐశ్వర్య బచ్చన్ మళ్లీ తల్లి కాబోతుందంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.