ఎవరు ఏమనుకున్నా సరే ‘ఆస్కార్’ సాధించి తీరుతా… డైరెక్టర్ రాజమౌళి ఇదే అనుకుని ఉంటారు! అందుకే ప్రతిష్ఠాత్మక అవార్డు తనకు దక్కేంత వరకు అస్సలు వదిలేలా కనిపించట్లేదు. దానికోసం శతవిధాల ప్రయత్నిస్తున్నారు. స్థాయికి మించి కష్టపడుతున్నారు. డైరెక్టర్ ఎవరైనా సరే సినిమా తీసి ఊరుకుంటారు. ప్రమోషన్స్ లో పాల్గొంటారు. రాజమౌళి మాత్రం అలా కాదు. చాలా డిఫరెంట్. సాధారణ ప్రేక్షకుడు మనసులోకి, వీలైతే ఆలోచనల్లోకి తన సినిమాని తీసుకెళ్లిపోతారు. సినిమా ఎందుకు చూడకూడదు అని మనం ఆలోచించేలా చేస్తారు.
ఇక విషయానికొస్తే.. రాజమౌళి అంటే కొన్నాళ్ల ముందు వరకు ఎవరికీ తెలీదు. ఎప్పుడైతే ‘బాహుబలి’ రిలీజైందో జక్కన్న సత్తా వరల్డ్ వైడ్ ప్రేక్షకులకు తెలిసిపోయింది. కేవలం మన దేశంలోనే కాకుండా విదేశీయులు కూడా సినిమా గురించి మాట్లాడుకున్నారు. ట్వీట్స్ కూడా పెట్టారు. ఇక బాహుబలి రెండు పార్ట్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి రాజమౌళి.. తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. ఇక వీటి తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ అనే క్రేజీ మల్టీస్టారర్ తీశారు. స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేసింది. రూ.1200 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించింది. రాజమౌళి రేంజ్ ని పెంచింది.
ఇక ‘ఆర్ఆర్ఆర్’ చూసిన వారంతా కూడా గెలుస్తామా లేదా అనేది పక్కనబెడితే కచ్చితంగా ఆస్కార్ రేసులో నిలవాల్సిన సినిమా అని అభిప్రాయపడ్డారు. కానీ మన దేశం నుంచి అధికారిక ఎంట్రీ మాత్రం దక్కలేదు. దీంతో రాజమౌళి.. తన సినిమాని నేరుగా ఆస్కార్ బరిలో నిలపడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రపంచమంతా చుట్టేస్తున్నాడు. ఈ మధ్యే జపాన్, అమెరికాలో బిజీగా బిజీగా ప్రమోషన్స్ చేస్తూ కనిపించాడు. ఇప్పటికే న్యూయార్క్ క్రిటిక్స్ అవార్డు, సాటర్న్ బెస్ట్ ఇంటర్నేషనల్ అవార్డ్ అందుకున్న ఈ సినిమా.. తాజాగా గోల్డెన్ గ్లోబ్ పురస్కారానికి నామినేట్ అయింది. ఇలా పేరొందిన అవార్డులే కాకుండా వేరే అవార్డ్స్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను వరిస్తున్నాయి. సినిమా రిలీజై తొమ్మిది నెలలు అయిపోతున్నా సరే రాజమౌళి ఇంకా అదే చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అయితే దీని వెనక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రపంచమంతా చుట్టేస్తూ ప్రతి ప్రేక్షకుడికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రాజమౌళి దగ్గరయ్యేలా చేశాడు. ‘ఆస్కార్స్’కు తన చిత్రాన్ని నామినేట్ చేయడం కోసం అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రొఫెషనల్స్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్లు కనిపిస్తుంది. ఇక ఆస్కార్స్ లో కొన్ని సినిమాలను ఓటింగ్ పద్ధతిలో సెలెక్ట్ చేస్తారు. వీటిని అకాడమీలోని 10 ప్రొఫెషనల్స్ వేస్తారు. వీళ్ల కోసమే ఆర్ఆర్ఆర్ స్పెషల్ షోలు రాజమౌళి ఏర్పాడు చేస్తున్నాడు. ఈ మొత్తం ప్రాసెస్ కోసమే దాదాపు రూ.80 కోట్ల మేర ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తను తీసిన ఔట్ ఫుట్ బాగుందని అందరూ మెచ్చుకుంటుంటే తాను మాత్రం ఎందుకు ఊరుకోవాలి. అయినంత వరకు ప్రయత్నిద్దాం. కుంభస్థలం కొట్టేద్దాం అని రాజమౌళి గట్టిగా ట్రై చేస్తున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలించి, ఆస్కార్ గనక సొంతమైతే మాత్రం జక్కన్న రేంజే కాదు టాలీవుడ్ స్థాయి అమాంతం పెరిగిపోవడం గ్యారంటీ. మరి రాజమౌళి ఆస్కార్ ప్రయత్నాల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
#SSRajamouli #Rajamouli pic.twitter.com/mpyYZQEMDK
— Puneeth dhfm ( #GlobeTrotting )❤🔥 (@SSMB28_DHFM) December 13, 2022