బాలీవుడ్ స్టార్స్ ప్రేమ, పెళ్లిలు మరియు విడాకుల విషయం నార్మల్ అయ్యింది. బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్స్ విడాకులు తీసుకున్నారు. ప్రేమ వివాహాలు చేసుకున్న వారు విడాకులు తీసుకుని ఎవరికి వారు అన్నట్లుగా జీవితం సాగిస్తున్నారు. ఇప్పటికి కూడా బాలీవుడ్ స్టార్స్ పలువురు విడాకులకు సిద్దంగా ఉన్నారు.. ఇటీవలే కూడా కొందరు విడాకులు తీసుకున్న సందర్బాలు ఉన్నాయి. తాజాగా మరో బాలీవుడ్ జంట విడిపోనుంది. బాలీవుడ్ ప్రముఖ ర్యాపర్, రోడీస్ ఫేమ్ రఫ్తార్, కోమల్ వోహ్రా జంట విడాకులు తీసుకోనున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం..
రాఫ్తార్ 2019లో డాన్స్ ఇండియా డ్యాన్స్ మరియు రోడీస్ రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా తన కెరీర్ ను ప్రారంభించాడు. రోడీస్ షో యొక్క మూడు సీజన్లలో అతను గ్యాంగ్ లీడర్‌గా కనిపించాడు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆ షో అతను మధ్యలోనే నిష్క్రమించాడు. రాఫ్తార్ “బుల్లెట్ రాజా”, “ఫగ్లీ”, “అంధాధున్” వంటి మరెన్నో చిత్రాలకు సంగీతాన్ని కూడా అందించాడు. అతను టీవీ నటి సురభి జ్యోతితో కలిసి ఒక మ్యూజిక్ వీడియో కూడా చేసాడు. అది కూడా చాలా విజయవంతమైంది. 2011లో కోమల్ మరియు రాఫ్తార్ లు వారి కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమయ్యారు. అనంతరం కొన్నాళ్ల పాటు ప్రేమిచకున్నారు. 2016లో నిశ్చితార్థం చేసుకుని పెళ్లి చేసుకున్నారు.
కోమల్ వోహ్ర ప్రముఖ బుల్లితెర నటులు కరణ్ మరియు కునాల్ వోహ్రాలకు సోదరి. ఈమె ఇంటీరియర్ డిజైనర్. కరణ్ మరియు కునాల్ లు “జిందగీ కి మెహెక్” మరియు “బ్రహ్మరాక్షస్” వంటి షోలతో మంచి పాపులర్ అయ్యారు. అయితే 2016లో పెళ్లి చేసుకున్న 6 ఆరేళ్ల తరువాత రాఫ్తార్, కోమల్ విడిపోతున్నారు. వారిద్దరు చాలా కాలం నుంచి విడివిడిగా నివసిస్తున్నారు. ఆ క్రమంలోనే 2020లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా అది ఆలస్యం అయింది. ఈ సంవత్సరం అక్టోబర్ నాటికి వీరిద్దరు చట్టబద్ధంగా విడిపోనున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rapper #Raftaar and #KomalVohra living separately; already ‘moved on’ amidst divorce rumours https://t.co/qe070rPgLR
— The Times Of India (@timesofindia) June 24, 2022