రీతూ చౌదరి.. ఈమె సీరియల్ ఆర్టిస్ట్ గా కంటే జబర్దస్త్ రీతూగానే అందరికీ బాగా తెలుసు. నిజానికి మొదట సీరియల్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టినప్పటికీ జబర్దస్త్ వల్లే ఆమెకు మంచి పేరు, గుర్తింపు లభించాయి. అజార్‌తో అనే ఆర్టిస్టుతో ఈమెకు రిలేషన్ చూపించి కొన్నాళ్లు వీళ్ల జంటకు బాగా హైప్ తీసుకొచ్చారు. ఆ తర్వాత జబర్దస్త్ రీతూగా ఫిక్స్ అయిపోయింది. ఆమె అందం, అమాయకత్వం, ఎన్ని పంచులు వేసినా నవ్వుతూ ఉండటం ప్రేక్షకులకు బాగా నచ్చేది. సీరియల్స్ లో నెగిటివ్ పాత్రలు చేసే రీతూ చౌదరి.. జబర్దస్త్ లో మాత్రం క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఫ్యాన్స్ ఫిదా చేసేసింది. ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా బాగానే యాక్టివ్‌గా ఉంటుంది.
తన లైఫ్‌లో జరిగే ప్రతి విషయం, ప్రతి వెకేషన్‌కు సంబంధించి ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవలే ఆమె పెళ్లి కూడా జరగబోతోంది అని వార్తలు బాగా వినిపించాయి. ఓ రాజకీయ నేపథ్యం ఉన్న కుర్రాడితో ప్రేమలో పడిందని.. ఇద్దరూ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత మళ్లీ పెళ్లి విషయంపై ఎలాంటి వార్తలు రాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు అటు జబర్దస్త్ ఇటు సీరియల్స్ తో ఫుల్ బిజీగా ఉంది. త్వరలోనే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది అని టాక్ వినిపిస్తోంది. అయితే అవి కేవలం పుకార్లా? లేక నిజంగానే బుల్లితెర నుంచి వెండితెర మీదకు ఎంట్రీ ఇవ్వబోతోందా? అనేదానిపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.