సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతను ఎక్కడికెళ్లినా వివాదం అనేది ఖచ్చితంగా క్రియేట్ చేస్తాడు. అయితే, వర్మకి ఆడియో లాంచ్ ప్రోగ్రామ్స్ , ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు ఇలాంటివన్నీ వైరల్ అయ్యేందుకు ఉపయోగపడతాయి. సాధారణంగా ఇండస్ట్రీలో వర్మ ఎవరిని కామెంట్ చేసినా లేదా అతనికి నచ్చి పొగిడినా వాళ్ళు ఫేమస్ అయిపోతారని టాక్ ఉంది.
ఇదివరకు వర్మ ద్వారా పాపులర్ అయినవారిలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ యాంకర్ అరియానా, అషురెడ్డిలు ఉన్న సంగతి తెలిసిందే. అదే క్రమంలో తాజాగా యాంకర్ శ్యామల పై షాకింగ్ కామెంట్స్ చేశాడు వర్మ. బడవ రాస్కెల్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న వర్మ.. ఆ ఈవెంట్ ని హోస్ట్ చేస్తున్న శ్యామల పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బడవ రాస్కెల్ ఈవెంట్ హోస్ట్ చేస్తున్న శ్యామల.. వర్మని నేరుగా కలవడం ఇదే మొదటిసారి అని చెప్పింది. తర్వాత వర్మ శ్యామల గురించి మాట్లాడుతూ.. ‘మీరు ఇందాక ఓ మాట అన్నారు. నన్ను కలవడం ఇదే ఫస్ట్ టైమ్ అని.. అది పక్కన పెడితే.. ఇంత అందంగా ఉన్న మీరు ఇంతకాలం నా కళ్ల నుండి ఎలా తప్పించుకున్నారు. అలాగే నన్ను తోపు, రౌడీ అన్నారు.. నేను రాస్కెల్ కూడా’ అంటూ షాకిచ్చాడు వర్మ. మరి శ్యామల పై వర్మ చూపు పడిందంటే.. శ్యామల ఫేట్ మారినట్లే అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మరి శ్యామల గురించి వర్మ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.