చిత్రం: వలిమై
నటీనటులు: అజిత్ కుమార్, కార్తికేయ, హ్యూమా ఖురేషి
రచన – దర్శకత్వం: హెచ్. వినోద్
సంగీతం: యువన్ శంకర్ రాజా
నిర్మాత: బోణి కపూర్
బ్యానర్: బే వ్యూ ప్రాజెక్ట్ ఎల్ఎల్పి
సినిమాటోగ్రఫి: నీరవ్ షా
గత ఏడాదిన్నర కాలంగా స్టార్ హీరో తలా అజిత్ కుమార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వలిమై’ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. పెద్ద సినిమాలు లేక విసుగుచెందిన ప్రేక్షకులు మంచి యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తుండగా వలిమైని రిలీజ్ చేశారు మేకర్స్. అజిత్ నటించిన పూర్తి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో వలిమై రిలీజ్ అయ్యింది. ట్రైలర్, టీజర్లతో భారీ అంచనాలు క్రియేట్ చేసిన వలిమై చిత్రం.. 2022లో బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంగా విడుదలైన వలిమై విశేషాలు ఏంటో చూద్దాం.
ఒక బైకర్స్ ముఠా కారణంగా వైజాగ్ సిటీ భయపడుతూ ఉంటుంది. డ్రగ్స్ సరఫరా, చైన్ స్నాచింగ్ లు, దోపిడీలు, ఇతర నేరాలకు పాల్పడుతున్న బైకర్స్ ముఠాలతో నగరంలో క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. అదే సమయంలో వైజాగ్ లో అడుగుపెట్టిన IPS అర్జున్ కుమార్ (అజిత్) వారితో పోరాడి, బైకర్స్ ముఠా వెనుక సూత్రధారి అయిన నరేన్(కార్తికేయ)ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. మరి నరేన్.. అర్జున్ చేతికి ఎలా చిక్కుకున్నాడు? అర్జున్ పై ఎలా పగ తీర్చుకుంటాడు? బైకర్స్ ముఠాను అర్జున్ ఎలా అంతం చేస్తాడు అనేది మిగతా కథ.
పూర్తి యాక్షన్ సినిమాగా తెరకెక్కిన వలిమై.. చిత్రంలో పవర్ ఫుల్ ఏసీపీ అర్జున్ కుమార్ గా అజిత్ కనిపించగా.. యువతను తప్పుదోవ పట్టించే క్రిమినల్ నరేన్ పాత్రలో కార్తికేయ గుమ్మకొండ నటించాడు. ఏసీపీకి సహకరించే సోఫియా పాత్రలో బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కనిపించింది.
వలిమై చిత్రం యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు కంప్లీట్ విందు భోజనం అనే చెప్పాలి. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలను తలదన్నే రీతిలో వలిమైని రూపొందించారు మేకర్స్. ఏసీపీ అర్జున్ కుమార్ గా తల అజిత్ మరోసారి అరిపించేసాడు. అజిత్ నిజజీవితంలో మంచి బైక్ రేసర్ కావడంతో.. బైక్ స్టంట్స్, చేసింగ్ సీక్వెన్స్, ఫైట్స్ లో హాలీవుడ్ యాక్షన్ హీరోలకు ఏమాత్రం తీసిపోనని నిరూపించాడు. విలన్ నరేన్ గా కార్తికేయ నటన అదరగొట్టాడు. యాక్షన్ సీన్స్, ఫైట్స్ లో కంప్లీట్ కొత్త కార్తికేయను పరిచయం చేసాడు దర్శకుడు.
బడ్జెట్ పరంగా వలిమై సినిమా టాప్ అనే చెప్పాలి. బోణి కపూర్ నిర్మించిన ఈ భారీ యాక్షన్ చిత్రంలో నిర్మాణ విలువలు హై లెవెల్ లో ఉన్నాయి. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన బలంగా నిలిచాయి. మరోసారి అజిత్ – యువన్ కాంబోలో మ్యాజిక్ రిపీట్ అయింది. ఇక సినిమాటోగ్రఫి విషయానికి వస్తే.. వలిమైని మరోస్థాయికి తీసుకెళ్ళింది. పింక్, రోబో 2.O చిత్రాలకు పనిచేసిన నీరవ్ షా.. వలిమైకి సినిమాటోగ్రఫీ అందించారు.
యాక్షన్ సన్నివేశాలలో కెమెరా పనితనం ఐ-ఫీస్ట్ గా ఉంటుంది. ఎడిటర్ విజయ్ వెల్ కుట్టి ఫస్ట్ హాఫ్‌లో ఎడిటింగ్ కి కాస్త పని చెప్పాల్సి ఉందని అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే విజువల్ ట్రీట్ తో పాటు స్టోరీలో అసలు ట్విస్ట్ థ్రిల్ కి గురిచేస్తుంది. ఇక సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా బాగుంది. క్రైమ్ – యాక్షన్ థ్రిల్లర్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు హెచ్. వినోద్ ఎఫర్ట్స్ వలిమైలో కనిపిస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్.. స్క్రీన్ ప్లే రేసిగా తీసుకెళ్లాడు దర్శకుడు హెచ్. వినోద్. కథపై క్లారిటీ ఉన్న దర్శకుడు.. సినిమా నిడివి ఎక్కువగా ఉండటంతో.. స్క్రీన్ ప్లే పై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. వలిమై.. ఒక పర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్. యాక్షన్ ప్రేక్షకులకు హాలీవుడ్ ఫీల్ కలిగించే స్థాయిలో విజువల్ ట్రీట్ ఉంటుంది. ముఖ్యంగా బైక్ చేసింగ్ సీన్స్, యాక్షన్ ఘట్టాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి.
‘బలం అమితమైన బలం ఇప్పుడు అదే అవసరం’ వలిమై సినిమా నుండి దర్శకుడు హెచ్. వినోద్ ఇచ్చిన సందేశం ఇది. ఎటువంటి సందర్భాలలో మనకు బుద్ధి బలం, మనోబలం అవసరం.. అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా, యువత మత్తుకు, నేరాలకు బానిసలుగా మారినప్పుడు.. వారినుండి మత్తును కాకుండా అటువంటి చెడు ఆలోచనలను మెదడులో నుండి పెకిలి పారేయాలని ధైర్యంగా నిలబడటమే ‘వలిమై’ సందేశం.
ఇక సినిమాలో కథ కథనాల కంటే కూడా సినిమాలో ప్రతీ యాక్షన్ సీక్వెన్స్ అదుర్స్ అనే చెప్పాలి. బైక్ స్టంట్స్ గానీ, బస్ స్టంట్స్ గానీ, పోలీస్ ట్రెజరరీలో స్టంట్స్ కావచ్చు.. ప్రేక్షకులు కథను మర్చిపోయి కళ్లప్పగించి తెరవైపు దృష్టిపెట్టేలా చేశాయి. ఈ విషయంలో స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్, దర్శకుడు వినోద్ లను అభినందించవచ్చు.
హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీన్స్
స్టోరీ పాయింట్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
అజిత్, కార్తికేయల నటన
సినిమా నిడివి
మధ్యమధ్యలో నెమ్మదించిన స్క్రీన్ ప్లే
చివరిమాట:
వలిమై.. యాక్షన్ ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ ఐ-ఫీస్ట్!