తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో యాక్షన్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. టాలీవుడ్ లో జేమ్స్ బాండ్, కౌబాయ్ తరహా చిత్రాలను తీసుకు వచ్చి ఒక ట్రెండ్ సృష్టించారు కృష్ణ. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆయన వారసుడు మహేష్ బాబు స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి ఇందిరాదేవి కన్నుమూశారు.
సూపర్ స్టార్ కృష్ణ స్టార్ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమయంలో ఆయనతో పాటు ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించారు విజయనిర్మల. అప్పట్లో ఆమె నటిగా, దర్శకురాలిగా రాణించారు. ఆ సమయంలోనే కృష్ణ ఆయన భార్య ఇందిరాదేవితో విడిపోయి విజయనిర్మలను వివాహం చేసుకున్నారు. ఇందుకు కృష్ణ సతీమణి ఇందిరాదేవి కూడా ఒప్పుకున్నారు. ఆమె వీరిద్దరి వివాహం ఒప్పుకోవడానికి పలు కారణాలు ఉన్నాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా రాణిస్తున్న సమయంలో కృష్ణకు కుటుంబ సభ్యులు వివాహం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన మేనమామ పెద్ద కూతురు ఇందిరాదేవి.. కృష్ణకు స్వయానా మరదలు. పెద్దల సమక్షంలో వీరి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. వివాహం జరిగిన తర్వాత కృష్ణ నటించిన గుఢాచారి చిత్రం బాక్సాఫీస్ షేక్ చేసింది. ఆ తర్వాత ఆయనకు వరుసగా ఎన్నో ఆఫర్లు వచ్చి సూపర్ స్టార్ గా ఎదిగారు. ఈ క్రమంలోనే ఆయనకు నటి, దర్శకురాలు విజయనిర్మలతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కొంత కాలం వీరిద్దరూ ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అప్పటికే విజయనిర్మలకు వివాహం జరిగి భర్తతో విడిపోయింది.
1969 లో కృష్ణ – విజయనిర్మల ఒక గుడిలో వివాహం చేసుకున్నారు. వీరు వివాహం చేసుకునే సమయానికి కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవికి రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల ఉన్నారు. విజయ నిర్మలకు సీనియర్ నరేష్ సంతానంగా ఉన్నాడు. కృష్ణ ద్వితీయ వివాహం చేసుకోవడం కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. ఆ సమయంలో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు కి వొదిన ఇందిరాదేవితో మంచి చొరవ ఉండేది. ఆ చొరవతోనే ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు. కృష్ణ తల్లికి కూడా నచ్చజెప్పి ఒప్పించారు. అదే సమయంలో ఇండస్ట్రీలో కృష్ణకి ఎప్పుడూ అండగా నిలుస్తూ.. వెన్నంటి ఉంటున్న విజయ నిర్మల గురించి తెలుసుకున్న ఇందిరాదేవి వీరి వివాహానికి ఒప్పుకున్నారు.
కృష్ణ-విజయ నిర్మల వివాహం జరిగినప్పటికీ తాను బతికి ఉన్నంత కాలం కృష్ణనే భర్తగా ఉండాలని.. ఆయన సంతానాన్ని చూసుకుంటూ ఉంటానని చెప్పింది. ఆ విధంగా ఇందిరాదేవి తన మంచి మనసు చాటుకున్నారు.. కృష్ణ-విజయ నిర్మలను ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు. అలాగే కృష్ణ కూడా ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నారు. ఇక విజయ నిర్మల కూడా కృష్ణను వివాహం చేసుకున్న తర్వాత పిల్లల్ని కనలేదు.
ఇది చదవండి: బ్రేకింగ్: మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం!