సాధారణంగా సినిమా రిలీజ్ అవుతుందంటే.. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హడావిడి మాములుగా ఉండదు. అది ఏ హీరో సినిమా అయినా ఆ ఫ్యాన్స్ తో పాటు వేరే హీరో ఫ్యాన్స్ కూడా ఫస్ట్ డే థియేటర్లకు పరిగెడుతుంటారు. ఓ స్టార్ హీరో సినిమాని అందరి హీరోల అభిమానులు థియేటర్లకు వెళ్లి చూడటం వరకు బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఫ్యాన్స్ లో మా హీరో – మీ హీరో అనే నినాదాలు బయటికి వస్తాయో.. అప్పుడే అసలు రచ్చ మొదలవుతుంది.
థియేటర్ల వద్ద ఫ్యాన్ ఫైట్స్ కూడా మాములే. కానీ అవి మాటామాటా పెరిగి, చేయి చేసుకునే స్టేజికి వెళ్తే పెద్ద వివాదానికి దారితీస్తుంది. తాజాగా టాలీవుడ్ మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఖిలాడి’. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదలైంది. అయితే.. ఖిలాడి సినిమా రిలీజైన థియేటర్ వద్ద అటు రవితేజ ఫ్యాన్స్, ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య వివాదం చెలరేగింది.
ఈ వివాదంలో రవితేజ ఫ్యాన్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ పై చేయి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఖిలాడి ఫ్యాన్ వార్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఈ గొడవలో ముందుగా ప్రభాస్ ఫ్యాన్స్ రవితేజ ఫ్యాన్స్ పై నోరు జారారని, అందుకే తాము వారిపై చేయి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు రవితేజ ఫ్యాన్స్. మరి ఈ వైరల్ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.