శాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్‌పై రామ్‌చరణ్ ఫ్యాన్స్ దాడి చేశారు. సునిశిత్ ఇంటి దగ్గరకు వెళ్లి మరీ అతడిపై దాడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఫేమ్ అయిన సునిశిత్‌పై రామ్ చరణ్ ఫ్యాన్స్ దాడి చేశారు. సునిశిత్ ఇంటి దగ్గరకు వెళ్లి మరీ అతడిపై దాడికి పాల్పడ్డారు. కొద్దిరోజుల క్రితం సునిశిత్ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ.. ఉపాసనపై కామెంట్లు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి ఇంటి దగ్గరకు పెద్ద సంఖ్యలో వెళ్లారు. అతడిపై దాడి చేశారు. సునిశిత్‌తో క్షమాపణలు చెప్పించారు. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో సునిశిత్ మాట్లాడుతూ.. ‘‘నమస్కారం అండి నా పేరు సునిశిత్. నేను ఓ ఛానల్‌లో చేసిన వ్యాఖ్యలు..
తప్పుడు వ్యాఖ్యలు చేశాను. సోషల్ పోస్ట్ ఇంటర్వ్యూలో నేను చేసిన వ్యాఖ్యలు తప్పుడు వ్యాఖ్యలు అని తెలియజేస్తున్నాను. పొరపాటు అయిపోయింది. నేను చేసిన తప్పుకు రామ్‌చరణ్‌గారి ఫ్యాన్స్ నన్ను కొట్టడం జరిగింది. ఇంకో సారి.. ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు ఎవరి గురించి కానీ, ఏ హీరో గురించి కానీ చేయను. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడను. నన్ను క్షమించండి. ఉపాసన వదినమ్మ గారికి, రామచరణ్ గారికి నా క్షమాపణలు. తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు గాను నేను బాధపడుతున్నాను’’ అని పేర్కొన్నాడు. కాగా, సునిశిత్ గతంలోనూ చాలా వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.
ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన లవర్ అని. ఆమెతో తాను కలిశానని కూడా కామెంట్లు చేశాడు. ఈ కామెంట్లపై లావణ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. వెళ్లిన ప్రతీ ఇంటర్వ్యూలో ఏదో ఒక హీరో.. హీరోయిన్‌పై కామెంట్లు చేస్తూనే వస్తున్నాడు. తాజాగా, ఉపాసనపై కామెంట్లు చేసి దెబ్బలు తిన్నాడు. మరి, సునిశిత్‌పై చరణ్ ఫ్యాన్స్ దాడి చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఉపాసన గురించి తప్పుగా మాట్లాడిన సునిశిత్ ను చితకబాదిన రాంచరణ్ ఫ్యాన్స్ 🔥🔥🔥
Inko sari social media lo kanapadadu inka 🤣😂@AlwaysRamCharan pic.twitter.com/xaOKTna0M5
— CHE GUEVARA™ (@Karthik4PSPK) May 13, 2023