ఎలన్ మస్క్.. ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 10 లో ఒకరు. టెస్లా సీఈఓ గా నిత్యం ఊపిరి సలపని పనులతో బిజీగా ఉన్నప్పటికి కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. వివాదాస్పద ట్వీట్లు, కామెంట్స్ చేయడానికి వెనకాడరు. ఇక మన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. వివాదాలకే కెరాఫ్ అడ్రెస్ అని చెప్పవచ్చు. దేశం, రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప్రతి అంశంపై వర్మ తనదైన శైలీలో స్పందిస్తూ ఉంటారు. వేర్వేరు రంగాలకు చెందిన వర్మ, మస్క్.. ఇద్దరు ట్విటర్ వేదికగా తారసపడ్డారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రం గురించి ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ కు ఆర్జీవీ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి : మరోసారి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసిన RGV!
ట్విటర్ లో నిత్యం యాక్టీవ్ గా ఉండే ఎలన్ మస్క్ జనవరి 28న ఓ ట్వీట్ చేశారు. ప్రజలను విపరీతంగా భయపెడితే.. ఒకానొక దశలో వారు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను వద్దంటారు. నిరంకుశత్వానికి ఇదే మూలం అని ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు. దీనికి ప్రపంచంలోనే స్వేచ్ఛను ఎక్కువగా ఇష్టపడే, అనుభవించే ఆర్జీవీకి ఈ ట్వీట్ తెగ నచ్చింది. వెంటనే మస్క్ అభిప్రాయాన్ని సమర్థిస్తున్నట్లుగా.. నమస్తే.. ఎమోజీలు పెట్టారు.
— Ram Gopal Varma (@RGVzoomin) January 28, 2022
ఇది కూడా చదవండి : టీఆర్ఎస్ మంత్రికి కొండా సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్
నిరంకుశత్వం, స్వేచ్ఛలకు సంబంధించి ఎలన్ మస్క్, ఆర్జీవీ పెట్టిన ట్వీట్లను కొంత మంది సమర్థిస్తుంటే.. ఆఖరికి ఎలన్ మస్క్‌ని కూడా నువ్వు వదలవా అంటూ మరికొందరు వర్మపై సెటైర్లు వేస్తున్నారు