ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్.. ఓవైపు హీరోగా, మరోవైపు ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న చరణ్.. ప్రొడ్యూసర్ గా గాడ్ ఫాదర్ మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. ఒక భాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను మరో భాషలోకి రీమేక్ చేయడమనేది ఎప్పటినుండో జరుగుతోంది. అలా వేరే భాషలో హిట్ అయిన సినిమాని తెలుగులోకి రీమేక్ చేసిన హీరోలలో రామ్ చరణ్ మినహాయింపు కాదు. ఎందుకంటే.. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తని ఒరువన్’ మూవీని తెలుగులో ‘ధృవ’ పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు.
ఇక ఇటీవల ఢిల్లీకి చెందిన ప్రముఖ హిందూస్తాన్ టైమ్స్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్.. సినిమాలను రీమేక్స్ చేయడంపై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసినట్లు సమాచారం. చరణ్ మాట్లాడుతూ.. “ఆల్రెడీ ఓటిటిలో అందుబాటులో ఉన్న సినిమాని ఇంకో భాషలోకి రీమేక్ చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే.. ఓటిటిలో ఉన్న సినిమాలను జనాలంతా ముందే చూసి ఉంటారు. ఓటిటి సినిమాలను రీమేక్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేస్తే.. ఆడియెన్స్ థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపించరు. ఒకవేళ రీమేక్ చేసిన సినిమాలో ఎవరైనా స్టార్ హీరో ఉంటే.. అతని క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రకారం కొంతవరకే థియేటర్లకు వస్తారు.” అని అన్నాడు.
ఇంకా మాట్లాడుతూ.. ‘స్టార్ క్రేజ్ బట్టి కొంతమేర జనాలు వస్తారేమో గానీ.. పూర్తి స్థాయిలో సినిమా వర్కౌట్ అవ్వకపోవచ్చు. పర్సనల్ గా నేను ఓటిటిలో లేని సినిమాలను రీమేక్ చేయడానికే ఆసక్తి చూపిస్తాను. అదికూడా నేను రీమేక్ చేయాలని అనుకుంటే.. ఆ సినిమా ఒరిజినల్ ప్రొడ్యూసర్ తో సినిమాని ఓటిటిలో రిలీజ్ చేయొద్దని అడుగుతాను. ఆ కండిషన్ కి సదరు ప్రొడ్యూసర్ ఒప్పుకుంటే.. రీమేక్స్ చేయడానికి నేను రెడీ” అని క్లారిటీ ఇచ్చాడు చరణ్. అయితే.. ఇక్కడ చరణ్ ఉద్దేశం.. రీమేక్ సినిమాలను హైలైట్ చేసే క్రమంలో హీరోల స్థాయి పడిపోతుందని.. ఒక రీమేక్ సినిమా కోసం హీరోల క్రేజ్, స్థాయిని తగ్గించుకునే అవసరం లేదని సినీవర్గాలు అంటున్నాయి. ఎందుకంటే.. ఈరోజుల్లో అన్ని సినిమాలు, అందరు హీరోలు పాన్ ఇండియా రిలీజ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం రీమేక్స్ పై రామ్ చరణ్ మాటలు నెట్టింట తెగవైరల్ అవుతున్నాయి.
Mega Power Star #RamCharan on Remakes 👌 @AlwaysRamCharan pic.twitter.com/uarEiYBOyV
— Fukkard (@Fukkard) November 30, 2022