గే.. హిజ్రా పేర్లు ఏవైనా సరే.. సమాజంలో వారికి ఎదురయ్యే అవమానాలు, చిన్నచూపు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు. స్వయంగా తల్లిదండ్రులే వారిని అంగీకరించరు. ఫలితంగా ఇల్లు వదిలేసి వెళ్లి.. భిక్షాటన చేస్తూ జీవించేవారే అధికం. ప్రస్తుత కాలంలో చాలా దేశాలు.. స్వలింగ వివాహాలకు ఆమోదం తెలుపుతున్నాయి. అయతే చట్టాల పరంగా వారికి ఎన్ని హక్కులు కల్పించినా సరే.. సమాజంలో వారి పట్ల ఉన్న చిన్న చూపు, హేళన భావం మాత్రం అంత త్వరగా పోదు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే.. గే వ్యవహారంపై స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలందరితో నటించింది. కొన్నాళ్ల క్రితం వరకు తెలుగులో వరుస చిత్రాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉండేది. కానీ గత కొంత కాలం నుంచి తెలుగులో ఆమెకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రపస్తుతం కేవలం బాలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తుంది. ఈక్రమంలోనే తాజాగా ఆమె హిందీలో నటించిన డాక్టర్ జీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. రకుల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసింది. ఈ క్రమంలో తాజాగా రకుల్‌కి సంబంధించిన పాత వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది. సుమారు 11 ఏళ్ల క్రితం నాటి ఈ వీడియోలో రకుల్.. గే అంశంపై సందిస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరలవుతున్నాయి.
2011లో రకుల్ మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొన్నది. ఈ సందర్భంగా ఆమెకు ఒకవేళ మీ కొడుకు గే అని తెలిస్తే.. ఏం చేస్తారు అనే ప్రశ్న ఎదురయ్యింది. దీనిపై రకుల్ స్పందిస్తూ.. ‘‘ఒకవేళ నా కుమారుడు గే అయితే.. ఆ విషయం తెలిసిన వెంటనే నేను షాక్‌కు గురవుతాను.. ఆ వెంటనే అతడి చెంప పగలకొడతాను. కానీ తర్వాత దాని గురించి తప్పక ఆలోచిస్తాను. అతడి నిర్ణయాన్ని గౌరవించి.. తనకు మద్దతుగా నిలబడతాను. తను అలానే బతకాలనుకుంటే దాని వల్ల నాకు ఎలాంటి సమస్య లేదని చెప్పడమే కాక.. ఆ దారిలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో తనకు సాయం చేస్తాను. ఎందుకంటే నేను ముక్కుసూటిగా ఉండే మనిషిని.. అలానే ఉండేందుకు ఇష్టపడతాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.