సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై పలువురు హీరోయిన్లు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. గతంలో తమకు సినీ ఛాన్సులు ఇప్పిస్తామని ఎంతో మంది లైంగికంగా హింసించారని.. పడక సుఖం ఇస్తేనే ఇండస్ట్రీలో చాన్సులు వస్తాయని చెప్పినట్లు హీరోయిన్లు తమ ఆవేదనను మీడియా సాక్షిగా వెల్లడించారు. డైరెక్టర్ సాజిద్ ఖాన్ పై ఇటీవల మీటూ లో భాగంగా పలువురు మహిళలు ఆయనపై ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ లో కంటెస్టెంట్ ఉన్నారు. ఈ నేపథ్యంలో సినీ తారలు సాజీద్ ఖాన్ ని వెంటనే బిగ్ బాస్ నుంచి తొలగించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంపై నటి రాఖీ సావంత్ మాట్లాడుతూ.. ఎందుకు అతనిపై కక్ష్య సాధిస్తున్నారు.. ఇప్పటికే అతడు నాలుగేళ్లు శిక్ష అనుభవించాడు. అప్పుడు ఎవరూ స్పందించలేదు.. కానీ ఆయన బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే అతడి గురించి నెగిటీవ్ గా మాట్లాడుతున్నారు. ఇలా చేయడం వల్ల కొంతమంది జనాల్లో హైలెట్ అవుతారని భ్రమలో ఉన్నారు. వాస్తవానికి అతడు నాకు బంధువు కాదు, స్నేహితుడు కాదు.. ఒక మనిషిగా మానవత్వంతో అతడి గురించి మాట్లాడుతున్నాను. అతనితో నేను సినిమాలు కూడా చేయలేదు. అతడు నింధితుడా, కాదా అన్నది తెలియదు.. కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు.
నాలుగేళ్లుగా ఇండస్ట్రీలో ఏ సినిమాలు లేవు.. చాలా కాలం తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే ఇప్పుడు ఆయన్ని టార్గెట్ చేసుకున్నారు. బిగ్ బాస్ నుంచి తప్పించడానికి పనికట్టుకొని చెడుగా పబ్లిసిటీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అతను మారి ఉండొచ్చు.. కొత్త జీవితాన్ని ఆరంభించాలని అనుకుంటున్నాడేమో.. ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అన్నారు. ఒక మనిషిగా అతన్ని అర్థం చేసుకోగలను. అందరూ ద్వేషిస్తే.. ఆత్మహత్య చేసుకుంటాడు అంటూ మీడియా ముందు ఎమోషన్ అయి ఏడ్చేసింది రాఖీ సావంత్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.