TikTok Durgarao: సోషల్ మీడియా పుణ్యమా అని టాలెంట్ ఉన్నవారంతా అతితక్కువ టైములో సెలబ్రిటీలు ఎదుగుతున్నారు. ఆ విధంగా టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులారిటీ తెచ్చుకొని.. సెలబ్రిటీ స్టేటస్ దక్కించుకున్నవారు టిక్ టాక్ దుర్గారావు దంపతులు. ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ అయినప్పటికీ సోషల్ మీడియలో ఈ దంపతుల క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దీంతో దుర్గారావు దంపతులు కొద్దీకాలంలోనే సెలబ్రిటీలు అయిపోయారు.
‘పలాస’ సినిమాలోని ‘నాది నక్కిలీసు గొలుసు’ పాటకు వీళ్లు వేసిన స్టెప్పులు ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ ఒక్క వీడియో ద్వారా దుర్గారావు దంపతుల ఫేట్ మారిపోయింది. వీరి స్టైల్ ని ఉపోయోగించి ఎన్నో డాన్స్ ప్రోగ్రామ్స్ లో పెర్ఫార్మన్స్ లు చేశారు. ఈ క్రమంలో దుర్గారావు దంపతులు కూడా బుల్లితెర మీద పలు కార్యక్రమాల్లో పాల్గొని ఫేమస్ అయిపోయారు. అనంతరం వీరికి సినిమాల్లోనూ అవకాశాలొచ్చాయి. దుర్గారావు ఇప్పటికే పలు సినిమాల్లో నటుడిగా కనిపించారు.
ఇక ‘జబర్దస్త్’ ప్రోగ్రామ్ లోనూ స్కిట్లు చేసిన ఈ దంపతులు.. యూట్యూబ్ చానల్ లో నూ సందడి చేస్తున్నారు. గతంలో దుర్గారావు బట్టలు నేసి కుటుంబాన్ని పోషించేవాడు. కానీ, టిక్ టాక్..ఆ తర్వాత యూట్యూబ్ వలన డిజిటల్ గా ఫేమస్ అయిపోయి చక్కటి అవకాశాలు వచ్చాయి. అలా ఇప్పుడు ఓ వైపు బుల్లితెరపైన టీవీ షోలు చేస్తూ వెండితెరపై అవకాశాలు అందుకుంటున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా దుర్గారావు తన బర్త్ డే సెలబ్రేషన్స్ వైజాగ్ లోని తేనేటి పార్కులో జరుపుకున్నాడు.
ఇక్కడ స్పెషల్ ఏంటంటే.. దుర్గారావు బర్త్ డే సెలబ్రేషన్స్ లో రాకేష్ మాస్టర్ పాల్గొని సందడి చేశాడు. ఈ క్రమంలో రాకేష్ మాస్టర్ దుర్గారావు దంపతుల గురించి మాట్లాడుతూ.. దుర్గారావు భార్య తనకు కూతురు లాంటిదని, దుర్గారావు సొంత తమ్ముడి కన్నా ఎక్కువని చెప్పాడు. అదేంటి ఆమెను కూతురని, అతన్ని తమ్ముడు అంటున్నాడని అనుకోకండి. ఓసారి రాకేష్ మాస్టర్ మాటలు వింటే మీకే అర్థమవుతుంది. అలా మాట్లాడే రాకేష్ మాస్టర్ హల్చల్ చేశాడు. ప్రస్తుతం దుర్గారావు బర్త్ డేలో రాకేష్ మాస్టర్ సెలబ్రేషన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.