డార్లింగ్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. రిలీజ్ కి టైం దగ్గరపడటంతో రాధేశ్యామ్ ప్రమోషన్స్ వేగంగా చేస్తోంది చిత్రబృందం. ఈ క్రమంలో ప్రభాస్ కూడా రాధేశ్యామ్ మూవీని ప్రమోట్ చేసేందుకు స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళితో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు ప్రభాస్.
ఇదంతా రాధేశ్యామ్ ప్రమోషన్స్ కోసమే అయినప్పటికీ ఇద్దరూ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. బాహుబలితో ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ చేశాడు రాజమౌళి. అప్పటినుండి ప్రభాvస్ రాజమౌళిని స్పెషల్ గా ట్రీట్ చేస్తుంటాడు. ఛత్రపతి నుండి ప్రభాస్ – రాజమౌళి మధ్య ఫ్రెండ్ షిప్ అలా కంటిన్యూ అవుతోంది. ఇక లేటెస్ట్ ఇంటర్వ్యూలో ప్రభాస్ – రాజమౌళి మధ్య సంభాషణలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.ప్రభాస్ సరదాగా మాట్లాడుతూ.. ‘చెయ్యి ఇంకొకరికి చూపించి ఫ్యూచర్ చెప్పు అనే ఆలోచనే నాకు ఎక్కదు’ అన్నాడు. దానికి రాజమౌళి స్పందిస్తూ.. ‘నీ చెయ్యి ఇంకొకరి చేతిలో పెట్టడం నీకు ఇష్టం లేదు’ నవ్వుతూ అన్నాడు. ఆ వెంటనే ప్రభాస్.. “ఏంటి నువ్ ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడుతున్నావా? అనేశాడు.. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు నీకు నువ్వు అలా ఫీలవుతున్నావ్!’ అని రాజమౌళి నవ్వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.