టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ మధ్యకాలంలో దర్శకుడిగా సినిమాలు తగ్గించేశారు. ఆయన సమర్పణలో సుడిగాలి సుధీర్ హీరోగా ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమా రూపొందుతోంది. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా పిల్లి, యాంకర్ విష్ణుప్రియ, అనసూయ భరద్వాజ్, సునీల్, వెన్నెల కిషోర్ ఇలా చాలామంది కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మిస్తున్నారు.
ఇక పూర్తి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగష్టు 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే.. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవలే ‘అబ్బా అబ్బా అబ్బబ్బ’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ చూస్తే.. నలుగురు హీరోలకు నలుగురు హీరోయిన్లను జోడించి.. దర్శకేంద్రుడి స్టైల్ లో హీరోయిన్స్ అందాలను క్యాచీగా చూపించాడు దర్శకుడు. ఈ పాట చూస్తే ఖచ్చితంగా రాఘవేంద్రరావు మార్క్ సూపర్ హిట్ సాంగ్స్ అన్ని గుర్తుకు వస్తాయి.
ఇదిలా ఉండగా.. ఈ రొమాంటిక్ పాటను స్వయంగా రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే.. మేకింగ్ లో చూస్తే ఆయనే హీరోయిన్లకు దగ్గరుండి వారిపై వాటర్ స్ప్రే చేస్తుండటం మనం చూడవచ్చు. ఇక ఈ పాటలో సుడిగాలి సుధీర్ జోడిగా దీపికా పిల్లి, వెన్నెల కిషోర్ కి జోడిగా విష్ణుప్రియ చేసిన డ్యాన్స్ హైలైట్ అవుతున్నాయి. సుధీర్ దీపికాలతో పాటు సప్తగిరి – నిత్యాశెట్టి, శ్రీనివాసరెడ్డి – వాసంతి, వెన్నెల కిషోర్ – విష్ణుప్రియ జోడిలుగా కనిపించారు. ప్రస్తుతం ఈ గ్లామరస్ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి సాంగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.