బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటి పరిణీతి చోప్రా సినిమాలు, టెలివిజన్ షో ద్వారా మంచి ఇమేజ్ సంపాదించుకుంది. బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించి ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తాను నటించిన సినిమాల ద్వారా ఫిలిం ఫేర్ అవార్డులను, జాతీయ స్థాయిలో ఫిలిం అవార్డులను అందుంకుంది. ఆమె ఓ రాజకీయ నాయకుడితో ప్రేమాయణం కొనసాగించి ఇటీవలె నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. తాజాగా ఆమెపై ఆ రాజకీయ నాయకుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాఘవ్ చద్దా ఓ యువ రాజకీయనాయకుడు. ఆప్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన వ్యక్తి. రాజ్యసభకు ఎంపికైన అత్యంత పిన్నవయస్కుడిగా గుర్తింపు పొందారు. ఇటీవలె ఈ యువనాయకుడు బాలీవుడ్ బామ పరిణీతి చోప్రాతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నరు. ఈ సందర్భంగా పరిణీతి చోప్రా తన జీవితాన్నే మార్చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపి రాఘవ్ చద్దా తెలిపారు. పరిణీతి, రాఘవ్ చద్దా కొంతకాలం నుంచి ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ ప్రేమ పక్షులు ఈనెల 13వ తేదీన ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో రింగ్స్ మార్చుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఇక పరిణీతి, రాఘవ్ చద్దా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో కలిసి చదువుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పరిణీతితో తన బంధంపై రాఘవ్ చద్దా తొలిసారిగా స్పందించారు.
ఒక శుభ ముహూర్తమైన రోజునాడు ఆ అందమైన అమ్మాయి తన జీవితంలోకి వచ్చిందని వెల్లడించారు. ఆమె వచ్చిన శుభ ఘడియల నుంచి తన జీవితమే మారిపోయిందన్నారు. తన జీవితాన్ని పరిణీతి రంగులమయంగా మార్చిందని.. ఎన్నో నవ్వుల్ని, సంతోషాల్ని తెచ్చిందని తెలిపారు. తమ ఎంగేజ్మెంట్ ఎంతో ఆనందదాయకంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేడుక ఆనందబాష్పాలు, చిరునవ్వులు, సంతోషాలు, డ్యాన్సులతో నిండిపోయిందని గుర్తు చేసుకున్నారు. ఈ వేడుక తమ ప్రియమైన వారిని మరింత దగ్గర చేసిందంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రాఘవ్ చద్దా తెలియజేశారు.