Radhika Apte: తమ బోల్డ్ కామెంట్స్‌తో తరచుగా వివాదాల్లో నిలిచే అతికొద్ది మంది బాలీవుడ్ హీరోయిన్స్‌లో రాథికా ఆప్టే ఒకరు. ఈమె తన బోల్డ్ కామెంట్స్‌తో సోషల్ మీడియాకు ఎప్పుడూ పని చెబుతూ ఉంటారు. కొద్దిరోజుల క్రితం హీరోయిన్స్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపిన సంగతి తెలిసిందే. “ఇండస్ట్రీలో శరీరాకృతి కోసం ముఖం, శరీర భాగాలకు సర్జరీ చేయించుకున్న హీరోయిన్లను చూశాను. పాపులారిటీ కోసం వాళ్ళు పడే ఇబ్బందులన్నీ తెలుసు. కానీ నేను నేను అలా కాదు. అలాంటివి నేను భరించలేను. శరీరాకృతుల(బాడీ పాజిటివిటీ) గురించి మాట్లాడే చాలామంది హీరోయిన్స్ తమ శరీర భాగాలను సర్జరీలతో మార్చుకున్నవారే. ఇలాంటివన్నీ చూసి చూసి నేను అలసిపోయాను” అనటం పెద్ద చర్చకు దారితీసింది.
ఈ వ్యాఖ్యల వేడి తగ్గక ముందే ఆమె మరో సారి బోల్డ్ కామెంట్స్ చేశారు. తన శరీరాకృతి.. ముఖ్యంగా పెదాలు, గోప్య భాగాలు పెద్దగా లేని కారణంగా చాలా సినిమాల్లో ఆఫర్లు కోల్పోయానని ఆమె అన్నారు. తాజాగా, ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాథికా ఆప్టే మాట్లాడుతూ.. ‘‘ నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో.. నా ముక్కు మార్చుకోమన్నారు. నా కాళ్లు, నా దవడ, నా గోప్య భాగాలు ఇలా అన్ని రకాల సర్జరీలు చేయించుకోమన్నారు. నేను అవేవీ పట్టించుకోలేదు.
నా జుట్టుకు రంగు వేసుకోవటానికి కూడా నాకు 30 ఏళ్లు పట్టింది. కొద్దిరోజుల క్రితం ఓ హీరోయిన్ పెదాలు, గోప్య భాగాలు నా కంటే పెద్దగా ఉన్నాయన్న కారణంగా నా బదులు ఆమెను సినిమాలోకి తీసుకున్నారు. ఆమె అందంగా కనపడుతోందని, సినిమా బాగా సేల్ అవుతుందని అన్నారు. నేను ఎంతో గౌరవించే వ్యక్తులే ఆ సినిమా చేస్తున్నారు. అన్ని రంగాల్లో ఎక్కువగా మహిళలు పవర్లో ఉంటే.. వాటన్నింటిలో మార్పులు వస్తాయి’’ అని అన్నారు. మరి, రాథిక బోల్డ్ కామెంట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Pawan Kalyan: నాని ఫంక్షన్ లో సినిమా వేరు, రాజకీయం వేరు.. రిపబ్లిక్ మూవీ ఫంక్షన్ లో మాత్రం అలా..!