బ్లాక్ బస్టర్ టాక్ తో భీమ్లానాయక్ థియేటర్లలో రికార్డుల వేట కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అటు పవన్, ఇటు రానా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అనే టాక్ వినిపిస్తోంది. రీమేక్ సినిమా అయినప్పటికీ దర్శకుడు సాగర్ కె చంద్ర, త్రివిక్రమ్, తమన్ ఇలా అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్, సాంగ్స్ విషయంలో తమన్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
— K I N G (@KingPaONEkalyan) March 1, 2022
అయితే ఇప్పుడు తమన్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. బీజీఎం కాపీ చేశాడంటూ అటు అభిమానులు, ఇటు నెటిజన్లు తమన్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇదీ అసలు ట్యూన్ అంటూ షేర్ చేస్తున్నారు. సినిమా క్లైమాక్స్ లో పవన్ కల్యాణ్.. రానా వాళ్ల ఇంటికి వచ్చి మళ్లీ తనని తాను పరిచయం చేసుకుంటాడు. ఆ సమయంలో వచ్చిన బీజీఎం కాపీ అంటున్నారు. అంతేకాదు ఇది ఒరిజనల్ అంటూ ట్యూన్ ను కూడా పోస్ట్ చేస్తున్నారు. దీనిపై తమన్ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి. మరి అది కాపీనే అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.