పీవీ సింధు.. ఈ పేరు తెలియని భారతీయులు ఉండరు. బ్యాడ్మింటన్ లో అద్భుతమైన ఆటతీరుతో ఎంతో మంది హృదయాల్లో చోటుసంపాందించింది. కోర్టులో రాకెట్ పట్టుకొి సింహంలా ప్రత్యర్థిలపై విరుచుకపడి అనేక టైటిల్ సొంత చేసుకుంది. సింధూ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తనదైన ఆటతో కోర్టులో విరుచుకపడే సింధు డ్యాన్స్ లో కూడా తనకున్న టాలెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. సినిమా స్టార్స్‌తో బాగా పరిచయం ఉన్న పీవీ సింధుకు వాళ్ల కంటే ఎక్కువ పాపులారిటీ ఉన్నప్పటికి ..డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని ఈజీగా అర్ధమైపోతుంది. గతంలో కచ్చా బాదాం లాంటి సాంగ్‌కు స్టెప్పులేసిన సింధు.. అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా పీవీ సింధు మరో డ్యాన్సింగ్ వీడియోతో అందరిని ఆకట్టుకుంది.
ఓ సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేసింది. తన డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ సాంగ్ కి ఆమె డ్యాన్స్ చేస్తూ.. “మీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో, అది చేయాలి”అని వీడియోకు ట్యాగ్‌లైన్ ఇచ్చింది. ట్రెండింగ్‌లో ఉన్న రెండు పాటలకు సంబంధించిన రిమిక్స్‌పై ఆమె డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది నెజిన్లు పీవీ సింధును అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. డ్యాన్స్ వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షన్నర వ్యూస్, లైక్‌లు వచ్చాయంటే ఈ బ్యాడ్మింటెన్ స్టార్ ఏ రేంజ్‌లో స్టెప్పులు వేసిందో చూడండి. మరి.. మీరు పీవీ సింధు డ్యాన్స్ వీడియోపై ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Dil Raju: కొడుకుని చూస్తూ మురిసిపోతున్న దిల్ రాజు.. వైరల్ అవుతున్న ఫొటో!