స్టార్ హీరో అల్లు అర్జున్ – లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా ఒక్కో ఏరియాలో ఒక్కోలా రెస్పాన్స్ దక్కించుకుంది. కానీ పుష్ప సినిమా చూసిన ప్రేక్షకులకు ఎక్కడో సుకుమార్ మార్క్ దారి తప్పి, స్పానిష్ దారికి మళ్ళిందేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. స్పానిష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసే ప్రేక్షకులకు సుకుమార్ పుష్ప లైన్ ఎక్కడ నుండి తీసుకున్నాడో ఈజీగా కనిపెట్టేస్తారు. సినిమా లైన్ మాత్రమే కాదు.. కొన్ని సన్నివేశాలు కూడా కాపీనే అంటున్నారు నెటిజన్లు. ఇంతకీ మరీ ఆ వెబ్ సిరీస్ ఏంటా అనుకుంటున్నారా..! వరల్డ్ వైడ్ పాపులర్ అయిన స్పానిష్ డ్రగ్ మాఫియా సిరీస్ ‘నార్కోస్’. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది.
అయితే.. నార్కోస్ వెబ్ సిరీస్ ఐడియా ఉన్నవాళ్ళకి సుకుమార్ ఇలా ఎలా స్టోరీ లైన్ మక్కీ దింపాడే అనిపిస్తుందని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. స్టోరీ లైన్ మాత్రమే కాకుండా కొన్ని కీలక సన్నివేశాలు అందులో నుండే స్ఫూర్తి పొంది రాసుకున్నారని అంటున్నారు. ‘నార్కోస్’ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. పాబ్లో ఎస్కోబార్ అనే డ్రగ్ మాఫియా డాన్ జీవిత కథ అది. కానీ పుష్పలో డ్రగ్స్‌కు బదులు ఎర్రచందనం పాయింట్ తో, ఎర్రచందనం సరఫరా చేసే ఓ సాధారణ వ్యక్తి.. ఆ రంగంలో డాన్ గా ఎలా మారతాడు.. అన్నట్లుగా ‘పుష్ప’ని సిద్ధం చేశారని టాక్.అయితే.. పుష్ప సినిమాలో ఆ సిరీస్ తాలూకా టచ్ ఈజీగా అర్ధమవుతుంది. కానీ దర్శకుడు తెలివిగా నార్కోస్ పాయింట్ మొత్తం వాడకుండా.. మన నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసుకొచ్చాడు. అందుకే స్పానిష్ సిరీస్ అని త్వరగా గుర్తించలేరు. ‘నార్కోస్’ పూర్తి యాక్షన్ కాకుండా రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. కానీ ‘పుష్ప’ను పూర్తి మాస్ యాక్షన్ మూవీగా మలచడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారని నెటిజన్లు అంటున్నారు. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.