సోషల్ మీడియా వల్ల ఏది, ఎప్పుడు, ఎందుకు ఫేమస్ అవుతుందో అస్సలు చెప్పలేం. అలా ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన వ్యక్తి నిర్మాత దిల్ రాజు. ‘వారసుడు’ సినిమా వల్ల గత కొన్నాళ్ల నుంచి వార్తల్లో నిలిచిన ఈయన.. ఇప్పటికీ ఇన్ స్టా, యూట్యూబ్ లో హాట్ టాపిక్ గానే ఉన్నారు. దానికి కారణంగా ఆయన రీసెంట్ గా యూజ్ చేసిన మేనరిజం. దిల్ రాజు ఏ స్టైల్లో అయితే మాట్లాడారో.. దాదాపు అదే మేనరిజమ్ ని నిర్మాత SKN అనుకరిస్తూ మాట్లాడారు. ఇప్పుడు అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక విషయానికొస్తే.. విజయ్ హీరోగా నటించిన వారిసు (తెలుగు ‘వారసుడు’).. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. తెలుగుతో పాటు మిగతాచోట్ల మాత్రం మిక్స్ డ్ రెస్పాన్స్ అందుకుంది. కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం దూకుడు చూపించింది. వారంలోనే రూ.210 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందని స్వయంగా నిర్మాణ సంస్థనే ప్రకటించింది. అయితే చెన్నైలో జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు స్పీచ్ బాగా వైరల్ అయింది.
ఆ స్పీచ్ లో భాగంగా తమిళంలో మాట్లాడిన నిర్మాత దిల్ రాజు.. ‘కామెడీ వెనుమా కామెడీ ఇరుక్కు.. ఫైట్స్ వెనుమా ఫైట్స్ ఇరుక్కు.. డ్యాన్స్ వెనుమా డ్యాన్స్ ఇరుక్కు’ అని మాట్లాడారు. ఇది నార్మల్ గానే అన్నప్పటికీ సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అయింది. చాలామంది ఇమిటేట్ కూడా చేశారు. అయితే తాజాగా జరిగిన ‘రైటర్ పద్మభూషణ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాత్రం టాలీవుడ్ నిర్మాత SKN.. దిల్ రాజు స్టైల్ ని ఇమిటేట్ చేశారు. దీంతో స్టేజ్ పై అందరూ నవ్వేశారు. ఇక ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. మరి నిర్మాత దిల్ రాజుని మరో నిర్మాత ఇమిటేట్ చేయడాన్ని మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.