ఈ పిల్ల యంగ్ హీరోయిన్. తెలుగులో అర డజను సినిమాలు చేసింది. క్రేజ్ బాగానే తెచ్చుకుంది. ఇప్పుడు ఏకంగా బోల్డ్ ఫొటోషూట్ తో అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఇంతకీ ఏం జరిగింది?
సినిమా హీరోయిన్ అనగానే ఎవరైనా సరే ఫస్ట్ గ్లామర్ మాత్రమే చూస్తారు. అందంగా ఉందా? ఒంపు సొంపులు, సోయగాలు చూపిస్తుందా లేదా అని మాట్లాడుకుంటారు. అందుకు తగ్గట్లే తక్కువ ఫేమ్ ఉన్న బ్యూటీస్ నుంచి స్టార్ హీరోయిన్ల వరకు గ్లామర్ విషయంలో కాస్త అడ్డుతెరలు తొలగించాలి. వయ్యారాలు ఒలకబోస్తూ ఉండాలి. వీటన్నింటితో పాటు సినిమాల్లో యాక్టింగ్ తోనూ ఆకట్టుకుంటూ ఉండాలి. అప్పుడే నలుగురు గుర్తుపడతారు. అవకాశాలు వచ్చే ఛాన్సులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే కొన్నిసార్లు షాకిచ్చేలా ఫొటోషూట్స్ తో హీరోయిన్లు ఆశ్చర్యపరుస్తుంటారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ ప్రియా వడ్లమాని మీలో ఎంతమందికి తెలుసు? అంటే మీ దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. కానీ ‘హుషారు’ బ్యూటీ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. అయితే ఇది ఆమె ఫస్ట్ సినిమా కాదు. తెలుగమ్మాయి అయిన ప్రియ.. 2018లో వచ్చిన ‘ప్రేమకు రెయిన్ చెక్’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘శుభలేఖలు’ అని మరోసినిమా కూడా చేసింది. కానీ ‘హుషారు’ మూవీ, అందులోని ‘అందం అమ్మాయైతే నీలా ఉందే’ పాటకు ఈమెకు విపరీతమైన ఫాలోయింగ్ తీసుకొచ్చింది.
అలా ‘హుషారు’ తర్వాత ఆవిరి, కాలేజ్ కుమార్ అని మరో రెండు మూవీస్ చేసినప్పటికీ అవి ఫ్లాప్ అయ్యాయి. గతేడాది చివర్లో ‘ముఖచిత్రం’ మూవీలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న రెండు పాత్రల్లో నటించి మెప్పించింది. ఈమె గ్లామర్ పరంగా బాగానే ఉంటుంది గానీ ఎందుకో అవకాశాలు రావడం లేదని అనుకున్నట్లు ఉంది. అదే ఊపులో హాట్ హాట్ ఫొటోషూట్స్ తో కాకరేపుతోంది. తాజాగా అలానే ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా అనేలా పలు ఫొటోలకు పోజిలిచ్చింది. అవి కాస్త వైరల్ గా మారాయి. ఎవరీ అమ్మాయి అని అందరూ సెర్చ్ చేసేందుకు కారణమైంది. మరి ప్రియా వడ్లమాని ప్యాంట్ లెస్ ఫొటోలు చూశాక మీకేం అనిపించింది. వెంటనే కింద కామెంట్ చేసేయండి.