టాలీవుడ్ లో విదేశీ హీరోయిన్ల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంగ్లాండ్ బ్యూటీ ఒలివియా మోరిస్ టాలీవుడ్ డెబ్యూ చేయగా.. ఇప్పుడు ప్రిన్స్ సినిమాతో ఉక్రెయిన్ బ్యూటీ మరియా అడుగు పెడుతోంది. మరియా పూర్తి పేరు మరియా ర్యాబోషప్కా. సింపుల్ గా మరియా అని పిలుస్తుంటారట. అయితే.. ఇప్పటివరకు తెలుగులోకి ఎంతోమంది ఫారెన్ మోడల్స్, హీరోయిన్స్.. ఐటెమ్ సాంగ్స్ వరకే చూస్తూ వచ్చాము. కానీ.. ఈ మధ్య విదేశీ బ్యూటీలు కూడా హీరోయిన్లుగా అవకాశాలు అందుకుంటున్నారు. సినిమా హిట్ అయితే ఏముంది.. సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ ఆఫర్స్ కూడా దక్కించుకుంటున్నారు.
ఈ క్రమంలో ఉక్రెయిన్ దేశం నుండి తెలుగు సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది మరియా. ఉక్రెయిన్ లో మోడల్ అయినటువంటి మరియా.. స్టార్ హీరో శివ కార్తికేయన్ సరసన హీరోయిన్ గా అంటే.. ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకులందరూ సర్ప్రైజ్ అయ్యారు. కానీ.. ఇప్పుడైతే.. ప్రిన్స్ నుండి మరియా ఫస్ట్ లుక్, బింబిలిక్కి, జెస్సికా సాంగ్స్ రిలీజ్ అయ్యాయో.. అప్పటినుండి అందరి దృష్టి మరియా పైనే పడింది. పేరుకు బ్రిటిష్ పిల్లే అయినా.. ఇండియన్ ట్రెడిషనల్ లుక్కుతో సినిమాలో అలరించనుంది. ప్రస్తుతం మరియా వయసు పాతికేళ్ళు. ప్రిన్స్ సాంగ్స్, ట్రైలర్, ప్రమోషన్స్ లో తన అందం, అమాయకత్వంతో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది మరియా.
ఇక 2018లో ఈథర్ అనే ఇంగ్లీష్ మూవీతో నటిగా కెరీర్ ప్రారంభించిన మరియా.. 2021లో స్పెషల్ ఓపీఎస్ 1.5 అనే హిందీ వెబ్ సిరీస్ ద్వారా ఇండియన్ ప్రేక్షకులకు పరిచయమైంది. ఇప్పుడు హీరోయిన్ గా ప్రిన్స్ మూవీతో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలకరించనుంది. ఇదిలా ఉండగా.. కొద్దిరోజులుగా ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. రష్యా – ఉక్రెయిన్ కి మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా తన ఫ్యామిలీకి దూరమైన మరియా.. ప్రిన్స్ మూవీ కోసం ఇండియాకి వచ్చిన వారానికే ఉక్రెయిన్ లో లాక్ డౌన్ పడినట్లు చెప్పుకొచ్చింది. అలాగే తన ఫ్యామిలీ కూడా ఉక్రెయిన్ నుండి వలస వెళ్లిపోయారని రీసెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వాపోయింది.
ఇదిలా ఉండగా.. స్వదేశం ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని చెబుతూ స్టేజిపై కంటతడి పెట్టుకుంది. ఈ క్రమంలో ప్రిన్స్ సినిమా కోసం తాను తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా ఉక్రెయిన్ దేశంలో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ కోసం డొనేట్ చేయనున్నట్లు తెలిపింది మరియా. మరియా మంచి మనసు చూసి తెలుగు, తమిళ ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. ఇక మరియా పేరు నోరు తిరగనప్పటికీ, మంచి మనసుతో అందరినీ మరిపించిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం మరియా అక్టోబర్ 21న రిలీజ్ కాబోతున్న ప్రిన్స్ మూవీ ఫలితం కోసం ఎదురు చూస్తోంది. అయితే.. ఆర్ఆర్ఆర్ తో ఒలివియాను, ప్రిన్స్ తో మరియా ఇలా చాలామందిని తెలుగు దర్శకులే పరిచయం చేయడం విశేషం.