ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఈ భాష, ఆ భాష అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అన్ని సినిమాలు చూసేస్తున్నారు. ఇక మలయాళం మూవీస్ కి అయితే తెలుగు రాష్ట్రాల్లోనూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే మలయాళ సినిమాపై మనం ఇంతలా ఇష్టం పెంచుకోవడానికి ‘ప్రేమమ్’ అనే సినిమా మెయిన్ రీజన్. 2015లో వచ్చిన ఈ మూవీ చూసిన తర్వాతే.. ఈ లాంగ్వేజ్ చిత్రాలపై ప్రేమ పెంచుకున్నారు. ఇక ఈ సినిమా డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రెన్ గురించి ఎంత చెప్పుకున్నా సరే తక్కువే. కానీ తాజాగా డిఫరెంట్ లుక్కులో కనిపించిన ఆయన.. ప్రతి ఒక్కరినీ షాక్ కు గురిచేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మలయాళ ఇండస్ట్రీ ఫేట్ మార్చిన సినిమాల జాబితాలో ‘ప్రేమమ్’ టాప్ లో ఉంటుంది. నివీన్ పౌలీ, సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ లాంటి యాక్టర్స్ తెలుగు వాళ్లకు పరిచయమైంది ఈ సినిమ వల్లే. ఇక డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రిన్ వర్క్ కి ప్రతి ఒక్కరూ అలా ఫిదా అయిపోయారు. ఈ సినిమా తర్వాత ఒక్కటంటే ఒక్క మూవీని ఈయన తీయలేదు. దాదాపు ఏడేళ్ల తర్వాత ‘గోల్డ్’ చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చారు. కానీ అంచనాల్ని అందుకోలేకపోయింది.
‘ప్రేమమ్’ లాంటి అదిరిపోయే మూవీ తర్వాత, అది కూడా ఏడేళ్ల తర్వాత అల్ఫోన్స్ సినిమా చేశారనగానే ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్ట్ చేశారు. దీనికి తోడు పృథ్వీరాజ్, నయనతార లాంటి స్టార్స్ ఉండేసరికి సినిమా సూపర్ ఉండొచ్చని అనుకున్నారు. కానీ ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. ఇదంతా పక్కనబెడితే.. అల్ఫోన్స్ లుక్ మాత్రం అందరికీ షాకిచ్చింది. ‘ప్రేమమ్’ చాలా నార్మల్ గా ఉన్న ఆయన.. ఇప్పుడు మాత్రం పూర్తిగా బక్కచిక్కిపోయి, నెరిసిన గడ్డంతో కనిపించారు. ఈయనేంటి ఇలా అయిపోయారని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఓ దానికి రెస్పాండ్ అయిన అల్ఫోన్స్.. తన ఆరోగ్యం గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు చెప్పారు గానీ ఏమైందనేది మాత్రం బయటపెట్టలేదు.
#Gold Director #AlphonsePuthren
Before & Now🙄 pic.twitter.com/OYaEE8vUoA
— RAJA DK (@rajaduraikannan) November 29, 2022