Pragathi: ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన దైన శైలి నటనతో తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నారు సీనియర్ నటి ప్రగతి. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్‌గా చేసిన ఆమె 2002నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడిపోయారు. ఇప్పటివరకు వందకు పైగా సినిమాల్లో నటించారు. తాజాగా, ఆమె అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘‘ఎఫ్3’’ సినిమాలో నటించారు. ఎఫ్2లో హీరోయిన్స్ తల్లి క్యారెక్టర్ చేసిన ఆమె ఎఫ్3లోనూ హీరోయిన్స్ తల్లిగానే నటించారు. ఈ సినిమా మే 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో సినిమాలోని భర్త పాత్ర గురించి ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ఎఫ్3 సినిమా గురించి ప్రశ్నలు అడుగుతూ వస్తోంది.
ఓ సందర్భంలో.. ‘‘ ఈ మూవీలో మీ హస్బెండ్ సేమ్ అంతేనా.. అంతేగా.. అంతేగా..’’ అని యాంకర్ అడిగింది. ప్రగతి దీనికి సమాధానం ఇస్తూ.. ‘‘ ఆ!.. అప్పుడికి, ఇప్పుడికి మొగుడ్ని మారిస్తే బాగోదుగా’’ అంటూ నవ్వుతూ.. ఫన్నీగా సమాధానం ఇచ్చారు. కాగా, ప్రగతి 1994లో వచ్చిన ‘‘వీట్లో విశేషమంగే’’ అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా వెండి తెరకు పరిచయం అయ్యారు. తమిళం, మలయాళంలో హీరోయిన్‌గా చాలా సినిమాలు చేశారు. 2002లో వచ్చిన మహేష్ బాబు ‘‘బాబీ’’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. మరి, ప్రగతి కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Manchu Vishnu: షూట్ గ్యాప్ లో మంచు విష్ణు- పాయల్ అల్లరి.. ఫొటోస్ వైరల్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.