టాలీవుడ్ టు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన డార్లింగ్ ప్రభాస్.. వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలనే లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే చేతిలో రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ K సినిమాలు ఉండగా.. తాజాగా డార్లింగ్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ పాన్ ఇండియా స్కేల్ బడ్జెట్ లో తెరకెక్కనుండగా.. ఇప్పుడు ఈ చిన్న సినిమా ట్విస్ట్ ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. డైరెక్టర్ మారుతితో ప్రభాస్ సినిమా చేయబోతున్నట్లు టాక్. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలన్నీ సుమారు రెండేళ్లదాకా టైం తీసుకుంటాయి. కాబట్టి ఆ గ్యాప్ ని కవర్ చేసేందుకు ప్రభాస్ – మారుతి కాంబో ఓ చిన్న మూవీ రానుందని సినీవర్గాలు చెబుతున్నాయి. అదీగాక ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఈ చిన్న ప్రాజెక్ట్ అవసరమా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ప్రభాస్ సినిమా అంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చూస్తారు. సో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని సినిమా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రభాస్ తదుపరి సినిమాలకు ఈ సినిమా ప్రాబ్లెమ్ కాకూడదు. ఇక ఇప్పటిదాకా చిన్నచిన్న సినిమాలు చేసిన డైరెక్టర్ మారుతికి పాన్ ఇండియా స్థాయి సినిమాలను హ్యాండిల్ చేసిన అనుభవం లేదు. అలాగని ప్రస్తుతం ప్రభాస్ పనిచేస్తున్న దర్శకులు అనుభవం ఉన్నవారు కాదు.
ఓవైపు ప్రభాస్ ఎంపిక కూడా సరైనదే అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తక్కువ సమయంలో సినిమాలు తెరకెక్కించి హిట్స్ కొట్టే సత్తా మారుతికి ఉంది. మరి ప్రభాస్ – మారుతి సినిమా ఉంటుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉండగా.. సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కాంబోకి పరిస్థితులు అనుకూలిస్తాయేమో చూడాలి. మరి ప్రభాస్ – మారుతి కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.