పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఇప్పుడు చేతినిండా సాలిడ్ సినిమాలు లైనప్ చేసి పెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ విడుదలకు రెడీ అయింది. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ భారీగా జరుపుతున్నారు చిత్రబృందం. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్.
ఇప్పటికే సినిమాకి సంబంధించి సాంగ్స్, ట్రైలర్స్ ప్రేక్షకులలో అంచనాలు పెంచేశాయి. సినిమా కూడా పలుమార్లు వాయిదా పడుతూ ఆఖరికి మార్చి 11న రాబోతుంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీని యూవీ క్రియేషన్స్ – గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిచాయి. ఇక తాజాగా చిత్రబృందం రాధేశ్యామ్ రిలీజ్ ట్రైలర్ వదిలింది.అదీగాక ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్, పూజా, రాధాకృష్ణ ముంబై మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ఇకపై రొటీన్ సినిమాలు మాత్రం చేయనంటూ చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అసలే రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్.. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలన్నీ డిఫరెంట్ జానర్స్ లో తెరకెక్కుతున్నాయి. మరి ప్రభాస్ లైనప్ మూవీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి