ఒక లైలా కోసం సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది పూజా హెగ్డే. ప్రస్తుతం సౌత్ టూ నార్త్ వరకు టాప్ హీరోయిన్‌గా ఎదిగింది పూజా హెగ్డే. ప్రస్తుతం ఆమె చేతి నిండా ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. ఇక ఈ ఏడాది పూజా హెగ్డేకు అంతలా కలిసి రాలేదు. ఇటు టాలీవుడ్ అటు తమిళ్‌లో ఆమె నటించి.. ఎన్నో ఆశలు పెట్టుకున్న భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించి మేర విజయం సాధించలేదు. అయినా పూజా హెగ్డే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తెలుగు, హిందీలో భారీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో ఎస్‌ఎస్‌ఎంబీ28లో మహేష్ బాబు సరసన నటిస్తుండగా.. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ సరసన కిసీ కా భాయ్ కిసీ కా ఝాన్, రణ్‌వీర్ సింగ్ సర్కస్ సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉంది బుట్టబొమ్మ.
ప్రసుత్తం వరుస షూటింగుల్లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంది పుజా హెగ్డే. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు బ్యాడ్ నూస్ చెప్పింది పూజా హెగ్డే. ప్రస్తుతం ఆమె నడవలేని స్థితిలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వార్త తెలిసి ఆమె ఫ్యాన్స్ తీవ్రంగా కంగారు పడుతున్నారు. ఈ ఫోటోలో పూజా హెగ్డే.. కాలుకు పట్టి కట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేసింది.
ఇక పూజా హెగ్డే కాలు లిగ్మెంట్ టియర్ కావడంతో ప్రస్తుతం తాను నడవలేని స్థితిలో ఉంది. అయితే కంగారు పడాల్సిన పనిలేదని.. త్వరలోనే కోలుకుంటానని.. ప్రస్తుతం తన పరిస్థితి బాగానే ఉందని తెలిపింది. ఇక సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కా ఝాన్ చిత్రం షూటింగ్‌లో యాక్షన్ సీన్స్ చేస్తున్న సయమంలో ఈ గాయం అయినట్లు తెలుస్తోంది. ఇటీవలే షూటింగ్ సెట్‌లో పూజా హెగ్డే బర్త్‌డే ఘనంగా సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంతలోనే ఇలా ప్రమాదానికి గురి కావడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం పూజా హెగ్డే ఎస్‌ఎస్‌ఎంబీ 28తో పాటు.. హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తుండగా.. మరో రెండు సినిమాల్లో యాక్ట్ చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదే కాక గతంలో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటిస్తోంది అని వార్తలు వచ్చాయి. ఇక పూజా హెగ్డేకు గాయం అయ్యిందని తెలియడంతో ఫ్యాన్స్ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.