టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన నాగశౌర్య.. పెళ్లి పనులు మొదలుపెట్టేశాడు. మొన్నటివరకు సైలెంట్ గా ఉండి సైలెంట్ గా పెళ్లి వార్తతో అందరినీ సర్ప్రైజ్ చేశాడు.
నాగశౌర్య పెళ్లికి సంబంధించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా బయటికి వచ్చేసింది. మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ హీరోలంతా దాదాపు ప్రేమించిన వారినే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు శౌర్య కూడా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇన్విటేషన్ కార్డుపై నాగశౌర్య - అనూష అని పేర్లు కూడా ఉన్నాయి. అయితే.. నాగశౌర్య తెలుసు. మరి.. ఈ అనూష ఎవరు? ఎక్కడుంటుంది? ఏం చేస్తుంది? ఆరా తీశారు జనాలు.
మొత్తానికి శౌర్యను పెళ్లాడబోయే అనూష ఎవరనే విషయం రివీల్ అయ్యింది. అలాగే అనూష ఫోటోలు, పూర్తి వివరాలు కూడా బయటికి వచ్చేశాయి.
శౌర్యకి కాబోయే అమ్మాయి పూర్తిపేరు అనూష శెట్టి. బెంగళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అని తెలుస్తోంది. అనూష శెట్టి మంగళూరు సమీపంలోని కుందాపూర్ లో బాగా పలుకుబడి ఉన్న ఫ్యామిలీకి చెందింది.
ఇక అనూష బెంగళూరులో పాపులర్ ఇంటీరియర్ డిజైనర్. అంతేగాక ఉమెన్ అచీవర్స్ లో ఒకరిగా గుర్తింపు కూడా సంపాదించుకుంది. 2019-20లో బెస్ట్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా సొంతం చేసుకుందట.
కాగా.. శౌర్య - అనూష శెట్టి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారని.. ఇరువురి పెద్దలను ఒప్పించే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం.
వీరి పరిచయం, ప్రేమ ఎలా జరిగాయనేది మాత్రం తెలియలేదు. కానీ.. వీరి పెళ్లి విషయానికి వస్తే.. రెండు రోజులపాటు ఘనంగా జరగబోతుంది.
ఇక నవంబర్ 19, 20 తేదీల్లో బెంగళూరులోని విట్టల్ మాల్యా రోడ్.. జెడబ్ల్యు మారియట్ హోటల్లో వేడుకలు నిర్వహించనున్నారు.
నవంబర్ 20న ఉదయం 11.25 గంటలకు శౌర్య - అనూషల పెళ్లి ముహూర్తాన్ని నిశ్చయించారు. ప్రస్తుతం అనూష శెట్టికి సంబంధించి కొన్ని అన్ సీన్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి.