మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. పేరుకి తగ్గట్టే జాస్మిన్ లా పరిమళిస్తుంటుంది. కేరళలో పుట్టి పెరిగిన మీరా జాస్మిన్ ‘అమ్మాయి బాగుంది’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రెండవ సినిమాతోనే పవన్ కళ్యాణ్ సరసన గుడుంబా శంకర్ సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది..
ఆ తర్వాత రవితేజ సరసన భద్ర సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత మహారథి, రారాజు, యమగోల మళ్ళీ మొదలైంది వంటి సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాష చిత్రాల్లో నటించింది. కెరీర్ లో హిట్స్ కంటే ప్లాపులే ఎక్కువగా ఉండడంతో అవకాశాలు తగ్గిపోయాయి.
2014లో అనిల్ జాన్ టైటస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అడపా దడపా మలయాళ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సినిమాలు ఏమీ చేయడం లేదు. అయితే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తోంది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా నేనున్నాను అంటూ టాలెంట్ చూపిస్తోంది. ఎప్పుడూ సాధుజీవిలా పద్ధతిగా కనిపించే మీరా జాస్మిన్ ఉన్నట్టుండి తనలోని వైల్డ్ యాంగిల్ ని బయట పెట్టింది. వాయిదా పద్దతిలో తన టాలెంట్ ని బయటపెడుతూ వస్తోంది. ఇటీవలే బ్లాక్ డ్రెస్ లో సోయగాలను ప్రదర్శించి ఉక్కిరిబిక్కిరి చేసిన మీరా జాస్మిన్ మరోసారి తన అందాల ప్రదర్శనతో ఉక్కబోత పెట్టిస్తోంది.
ఇంతటి చలిలో కూడా టెంపరేచర్ రైజ్ చేస్తోంది. మగాళ్ల ఆర్కెస్ట్రా డిస్టర్బ్ చేసే రేంజ్ లో బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ.. ‘కంట్రోల్ చేసుకోలేని అడవి పువ్వుల అందం’అంటూ రాసుకొచ్చింది. ఈ మాటకే కుర్రాళ్ళు జేబులో చేతులు పెట్టుకుని వెళ్లిపోయే పరిస్థితి. అలాంటిది ఇక ఫోటోలు చూస్తే తట్టుకోగలరా? మీరా జాస్మిన్ లో ఈ వైల్డ్ యాంగిల్ చూసి జనాలు పిచ్చెక్కిపోతున్నారు..
40 ఏళ్ల వయసులో ఆంటీ అని పిలిపించుకోవాల్సిన మీరా.. తన చెక్కు చెదరని గ్లామర్ తో ‘అమ్మాయి బాగుంది’ అనిపించుకుంటుంది. 40 ఏళ్ల వయసులో కూడా ఏ మాత్రం తగ్గకుండా పరువాల విందు చేస్తున్న మీరా జాస్మిన్ కి ఏ వెబ్ సిరీస్ లోనో, సినిమాలోనో అవకాశం రాకుండా ఉంటుందా? ఈ టాలెంట్ చూసి అవకాశం ఇవ్వాల్సిందే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.