సాధారణంగా నటీ నటులు కొంచెం గ్యాప్ దొరికినా గానీ విదేశాల్లో సేదతీరుతుంటారు. ఇలాంటి వెకేషన్లకు పెట్టింది పేరు మాల్దీవులు. మెున్నటికి మెున్న రష్మిక మందన్నా అక్కడికెళ్లి రచ్చ చేస్తే.. నిన్న అషు రెడ్డి తన అందాలతో మాల్దీవులను హీటెక్కించింది.
ఇక తాజాగా బుల్లితెర సోయగం యాంకర్ దీపికా పిల్లి తన అందాలతో కుర్రకారు మతులు పోగొడుతోంది. టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన దీపికా ఆ తర్వాత బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది.
ఢీ షో ద్వారా యాంకర్ గా పరిచయం అయిన ఈ అందం.. ఆ తర్వాత వరుసగా స్టార్ మా కామెడీ షో, జబర్ధస్త్ లాంటి పలు షోల్లో మెరిసి మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది దీపికా పిల్లి.
చెఱుకు రసాల్లాంటి పెదాలతో పండ్ల రసాలను తాగుతూ.. కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తోంది. బ్లాక్ డ్రెస్ లో స్విమ్మింగ్ పూల్ కే చమటలు పట్టిస్తూ.. చిరునవ్వులు చిందిస్తుంది ఈ చిన్నది.
గుడ్ ఫుడ్.. గుడ్ మూడ్ అంటూ బ్రేక్ ఫాస్ట్ మూడ్ ను తెగ ఎంజాయ్ చేస్తూ.. కుర్రాళ్ల మూడు చేడగొడుతోంది ఈ దీపికా. పూల్ గొడపై యువరాణిలా కూర్చుని ఫ్రూట్ జ్యూస్ తాగుతూ.. ఆమె చిల్ అవుతూ.. యువత గుండెకు తన చూపులతో చిల్లులు పెడుతోంది.
ఇక ప్రస్తుతం దీపికా పిల్లి పలు చిత్రాల్లో మెరుస్తూ.. వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయాత్నాల్లో ఉంది. సుడిగాలి సుధీర్ నటించిన వాంటెడ్ పండుగాడు చిత్రంలో దీపికా పిల్లి నటించి మంచి మార్కులు కొట్టేసింది.