సినీ పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. దాంతో ఈ రంగంలోకి అడుగుపెట్టి, నిలదొక్కుకోవాలి అంటే అంతో.. ఇంతో గ్లామర్ షో చేయాలి. ఈ మాట బాగా వంటపట్టించుకున్నట్లుంది బిగ్ బాస్ సోయగం.. దివి.
అందుకు తగ్గట్లుగానే వరుసగా తన ఫోటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ.. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా మరోసారి తన నాజుకైన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేసింది.
దివి.. "నీ కన్నుల తడితో దిద్దిన అందం నీ కంటికి మాత్రమే సొంతం" అంటూ.. పర్పుల్ కలర్ డ్రెస్ లో ఫోటోలకు పోజిచ్చింది బిగ్ బాస్ ముద్దుగుమ్మ దివి. బిగ్ బాస్ లో ఓ ఎపిసోడ్ కు గెస్ట్ గా వచ్చినప్పుడు దివి కళ్లను చూసి మెగాస్టార్ సైతం మెచ్చుకోవడం మనకు తెలుసు.
ఈ క్రమంలోనే అవకాశాలకోసం కమిట్ మెంట్ ఇవ్వడంలో తప్పేమీ లేదని షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. మాటలతో కంటే దివి ఫోటోలతోనే ఎక్కువగా మాయ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా మరో సారి పర్పుల్ కలర్ డ్రెస్ లో తన సోయగాలకు, చురకత్తుల లాంటి తన చూపులను యాడ్ చేసింది.
ఇంకేముంది.. గుండెలు పట్టుకోవడం కుర్రాళ్ల వంతైంది. కూల్ గ్లాసెస్ పెట్టుకుని హాట్ హాట్ పోజులిచ్చింది. లాంగ్ బూట్లతో.. తన థైస్ అందాలను చూపిస్తూ.. కవ్విస్తోంది. ఇక తాను కూర్చిలో కూర్చున్నాగానీ.. ఆభరణాలు లేని మహరాణిలా ఉంది.
అందమే ఆమెకు ఆభరణం అయినప్పుడు ఇంక ఆభరణాలు ఎందుకన్నట్లు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ అమ్మడు ఇటలీలో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ బిజీగా ఉంది.